»   »  'గబ్బర్‌ సింగ్‌ 2' స్క్రిప్టు గురించి సంపత్ నంది

'గబ్బర్‌ సింగ్‌ 2' స్క్రిప్టు గురించి సంపత్ నంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్‌ సింగ్‌గా పవన్‌ కల్యాణ్‌ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్‌ సింగ్‌'కి రెండో భాగం రూపుదిద్దుకోబోతోంది. పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి సంపత్ నంది మాట్లాడారు.

సంపత్ నంది మాట్లాడుతూ... ''గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని సంపత్‌నంది చెబుతున్నారు. ఇక ఈ చిత్రం అఫీషియల్ లాంచ్ డిసెంబర్ 28 అని విశ్వసనీయ సమాచారం. వెన్యూ ఎక్కడనేది ఫైనలైజ్ కాలేదు.

'రచ్చ'తో ఆకట్టుకున్న సంపత్‌.. ఆ తరవాత చేస్తున్న చిత్రమిదే. శరత్‌ మరార్‌ నిర్మాత. ఇటీవలే గోవాలో స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. పవన్‌ పక్కన ఓ కొత్త హీరోయిన్ ను ఎంచుకున్నట్టు సమాచారం. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అయితే భవిష్యత్‌లో పవర్ స్టార్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే సంపత్‌ స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్‌కెళ్లడానికి రెడీ అయ్యాడు. అయితే టైటిల్‌ కన్ఫ్యూజన్‌ తేలటం లేదు. ఆయన ఫ్యాన్స్,సన్నిహితులు చాలా మంది గబ్బర్ సింగ్ పెడితేనే ఆ క్రేజ్ ఉంటుందని చెప్తున్నారు. దాంతో పవన్‌ ....'గబ్బర్‌సింగ్‌' టైటిల్ ని 'షోలే' నిర్మాతల నుంచి కొనేయడానికి రెడీ అయిపోయాడని చెప్తున్నారు. భారీ మొత్తం చెల్లించి అయినా కాపీరైట్‌ హక్కుల్ని తీసుకోవాలని నిర్ణయించినట్టు ఓ సమాచారం.

గతంలో 'బెంగాళ్‌ టైగర్‌', 'పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌2' అనే టైటిల్స్‌ పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. ఇక అవన్నీ లేనట్టే. 'గబ్బర్‌సింగ్‌-2' ఫైనల్‌ అయినట్టే. ఇక పవన్ కళ్యాణ్ మల్టి టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. 24 క్రాప్ట్ లను సమర్ధవంతంగా నిర్వర్తించగల ఆయన త్వరలో తను హీరోగా చేసే చిత్రానికి స్క్రీన్ ప్లే రాస్తున్నాడని సమాచారం.

English summary

 Pawan Kalyan film ‘Gabbar Singh 2’ is in news from long time. The film makers have finally decided to launch the film on Dec 28th. The venue for this event is not yet finalized and Director Sampath Nandi has earlier clarified that the film is not a sequel to ‘Gabbar Singh’. Devi Sri Prasad will compose tunes for ‘Gabbar Singh 2’. Sarath Marar is producing the film on North Star Entertainment P Ltd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu