»   » జెడి చక్రవర్తి దర్శకత్వంలో రీ ఎంట్రీ ఇస్తోన్న గజాల

జెడి చక్రవర్తి దర్శకత్వంలో రీ ఎంట్రీ ఇస్తోన్న గజాల

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన చేసిన గజాల ఆ తర్వాత తొట్టి గ్యాంగ్ వంటి కొన్ని చిత్రాలు చేసినా మెల్లిమెల్లిగా అవకాశాలు తగ్గిపోవటంతో మాయమైపోయింది. అయితే త్వరలో ఆమె మళ్ళీ తెలుగు తెరను పలకరించటానికి రెడీ అవుతోంది. జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న మనీ సీక్వెల్ 'మనీ మనీ మోర్ మనీ' చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. 'అనంతపురం', 'సర్వం' వంటి డబ్బింగ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింహపురి టాకీస్ అధినేతలు రఘునాద్, నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. బ్రహ్మానందంకీ రోల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ విషయమై నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్తున్నారు. 'హోమం', 'సిద్దం' తో మాస్, యాక్షన్ చిత్రాలు బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్న జే.డి. 'మనీ మనీ మోర్ మనీ' తో కామెడి కూడా బాగా తీయగలరని నిరుపించుకుంటారు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: భరణి కే ధరన్, కదా,స్క్రీన్-ప్లే, దర్శకత్వం: జె.డి.చక్రవర్తి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu