»   » ఏం జరిగింది? దాన్ని సంపూర్ణేష్ బాబు ఎందుకు డిలీట్ చేసాడు?

ఏం జరిగింది? దాన్ని సంపూర్ణేష్ బాబు ఎందుకు డిలీట్ చేసాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు మైనింగ్ సామ్రాజ్యం, జైలు జీవితం లాంటి అంశాలతో వార్తల్లో నిలిచిన గాలి జనార్ధన్ రెడ్డి... ఇటీవల మళ్లీ తన కూతురు వివాహం సందర్బంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. గాలి కూతురికి ఇటీవలే రాజీవ్‌రెడ్డితో నిశ్చితార్థమైంది.

కూతురు పెళ్లికి కోట్ల ఖర్చు పెడుతున్న గాలి... అందుకు తగిన విధంగానే వెడ్డింగ్ కార్డ్ తయారు చేయించాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా పెళ్లి పత్రికను ఓపెన్ చేయగానే 'ఆహ్వాన' వీడియో కనిపించిన విషయం తెలిసిందే.

ప్రముఖులందరికీ ఈ వెడ్డింగ్ కార్డులను స్వయంగా అందజేస్తున్నారు గాలి. కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబుకు కూడా గాలి తన కూతురు పెళ్లి ఇన్విటేషన్ అందించారు. ఆ విషయాన్ని సంపూర్ణేష్ బాబు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.

గాలి ప్రేమాభిమానాలకు బానిసను అంటూ..

గాలి ప్రేమాభిమానాలకు బానిసను అంటూ..

‘గాలి జనార్ధన్ రెడ్డి గారి అమ్మాయి వివాహ పత్రిక అందుకోవటం సంతోషకరమైన విషయం. ఆ కుటుంబం నా పైన చూపించే ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ బానిసను' అంటూ ఆహ్వాన పత్రిక అందుకుంటున్న ఫొటోను సంపూ తన సోషల్ మీడియాలో సోమవారం రాత్రి పోస్ట్ చేశాడు.

ఎందుకు డిలీట్ చేసాడు?

ఎందుకు డిలీట్ చేసాడు?

అయితే మంగళవారం ఉదయం సంపూ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అయితే సంపూర్ణేష్ బాబు ఆ పోస్టును ఎందుకు డిలీట్ చేసాడు? రాత్రికి రాత్రి ఏం జరిగింది? అనేది హాట్ టాపిక్ అయింది.

rn

గాలి కూతురు వెడ్డింగ్ కార్డ్ వీడియో

గాలి కూతురు వెడ్డింగ్ కార్డ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

rn

ఇదే తొలిసారి

ఈ వీడియోలో జనార్ధన్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మితోపాటు కుమారుడు, కూతురు బ్రాహ్మణి, కాబోయే అల్లుడు రాజీవ్ రెడ్డి కనిపిస్తారు. నవంబర్ 16న జరిగే బ్రాహ్మణి, రాజీవ్‌ల వివాహానికి హాజరు కావాలంటూ ఆ పాటలో ఉంటుంది. శివలింగానికి పూజ చేస్తూ గాలి దంపతులుండగా, మిగితా వారు కూడా వారిద్దకు చేరుకుంటారు.

English summary
Gali Janardhan Reddy has reportedly invited leading politicians and movie stars for his daughter's marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu