»   » పూరితో ఇరవయ్యేళ్ల అనుబంధం

పూరితో ఇరవయ్యేళ్ల అనుబంధం

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్ తో నాకు ఇరవయ్యేళ్ల అనుబంధం ఉంది అంటున్నారు నిర్మాత గణేష్ బాబు. ఆయన తాజాగా తన పరమేశ్వర ఆర్ట్స్‌ సంస్థ బ్యానర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నానని ప్రకటించారు. ఈ విషయం చెప్తూ పూరీతో అనుబందం గుర్తు చేసుకున్నారు. అలాగే పూరి, నా కలయికలో వచ్చే చిత్రంలో ఓ స్టార్ హీరో నటిస్తారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాను అన్నారు. ఇక వచ్చే యేడాది ప్రథమార్ధంలో తమ సంస్థకి పూరి చిత్రం చేస్తారని తెలిపారు.

ప్రస్తుతం పూరి మహేష్‌బాబుతో 'ది బిజినెస్‌ మేన్‌' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇదే చిత్రాన్ని అభిషేక్‌ బచ్చన్‌తో హిందీలో రీమేక్‌ చేస్తారు. ఆ తర్వాత రవితేజతో 'ఇడియట్‌ 2' చేస్తారు. వీటి అనంతరం గణేష్ బాబు చిత్రం ఉంటుంది. ఇక గణేష్ బాబు తీన్ మార్ చిత్రం అనంతరం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చిత్రం ప్లాన్ చేసారు. బాలీవుడ్ హిట్ దబాంగ్ రీమేక్ గా హరీష్ శంకర్ దర్సకత్వంలో ఆ చిత్రం ప్రారంభం కానుంది.

English summary
Ganesh Babu said “I am very happy that Puri Jagannath had accepted our offer and accepted to do a film under our banner. I share good relation with him from 20 years, and I deem it to be my luck that he had agreed to do a film in view of our relation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu