»   » సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ మౌనంగా: గణేష్ బాబు

సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ మౌనంగా: గణేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కళ్యాణ్‌ బాబు గురించి మరో మాట చెప్పాలి. ఆయన నాకు సినిమా చేస్తానని ప్రకటించగానే చాలామంది ఆయన దగ్గరికి వెళ్లి 'గణేష్‌ బాబుకి సినిమా చెయ్యడం అవసరమా' అని అన్నప్పటికీ వారికేం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండి, నాకు సినిమా చేసిన మంచి వ్యక్తి కళ్యాణ్ ‌బాబు అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చారు నిర్మాత గణేష్.ఆయన తాజా చిత్రం తీన్ మార్ రేపు (గురువారం)విడుదల అవుతోంది. ఆ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే ఇంతకుముందు కళ్యాణ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నాను. అయితే అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత కళ్యాణ్‌బాబే యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ చిత్రం ఇంత తొందరగా ప్రారంభం కావడానికి కారకులయ్యారు.'లవ్ ఆజ్ కల్' చిత్రం రీమేక్ రైట్స్ కొన్నాం. ఈ సినిమాకి త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రీన్‌ప్లే, డైలాగులు తయారు చేశారు. లవ్లీ డైరెక్టర్‌గా పేరొందిన జయంత్‌గారు ఇంతవరకూ తను తీసిన ప్రేమకథాచిత్రాల్లో నెంబర్‌వన్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు అంటూ చిత్రంపై తన నమ్మకాన్ని వెల్లడించారు.

English summary
Pawan Kalyan’s latest flick ‘Teen Maar’ with Trisha as his co-star under Jayanth C Paranjee’s direction is releasing tomorrow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu