For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కమల్ నేను విడిపోవడానికి కారణం అదే.. ఆ నటి గురించి మాట్లాడను.. గౌతమి

  By Rajababu
  |

  కెరీర్ ఆరంభంలో నటి గౌతమి టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసినా.. ఆమె తమిళ ప్రేక్షకులకే ఎక్కువ సుపరిచితలు. విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో సహజీవనం తర్వాత గౌతమి ఇంకా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కమల్ చిత్రాలకు పనిచేస్తూ క్యాస్టూమ్ డిజైనర్‌గా తన సత్తాను చాటింది. అంతా సవ్యంగానే జరుగుతున్న సమయంలో వారిద్దరూ సహజీవనానికి బ్రేకప్ చెప్పారు. దాంతో వారి వ్యవహారం సంచలనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.

  అవన్నీ పుకార్లే..

  అవన్నీ పుకార్లే..

  కమలహాసన్‌ గురించి మాట్లాడుతూ సినిమాలో పోషించే పాత్రలకు, నిజజీవితంలో క్యారెక్టర్‌కు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. మేము విడిపోవడానికి కారణమని వస్తున్న వార్తలన్నీ పుకార్లే. తాము ఒకటి అనుకొని జీవితం ప్రారంభించాం. కానీ ఆ లక్ష్యం నెరవెరలేదు. అందుకే నేను విడిపోవాలని అనుకొన్నాను.

  ఒకే దారిలో నడుద్దాం

  ఒకే దారిలో నడుద్దాం

  ఒకేదారిలో నడుద్దామని అనుకొన్నాం. ఆ తర్వాతే జీవితాన్ని పంచుకొన్నాం. కానీ ఆ తర్వాత మేము వేర్వేరు దారుల్లో వెళ్లడం ప్రారంభించాం. దాని వలన మేం కలిసి జీవించడంలో అర్థం లేదనే ఫీలింగ్ కలిగింది.

  కమల్ బ్రేకప్ ఎమోషనల్

  కమల్ బ్రేకప్ ఎమోషనల్

  13 ఏళ్ల సహజీవనం తర్వాత కమల్‌తో విడిపోవడమనేది చాలా భావోద్వేగమైన అంశం. చాలా నెలలు కన్నీటితో కూడిన జీవితం అనుభవించిన తర్వాతే ఆ నిర్ణయానికి వచ్చాను. కమల్‌తో విడిపోయిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి చాలా కష్టమైంది. కొత్త ఇల్లు, కొంత జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి చాలా సమయం పట్టింది.

  నా తల్లి ఎలా అయితే

  నా తల్లి ఎలా అయితే

  ఇప్పుడు నా కూతురు సుబ్బలక్ష్మీ నా జీవితం. నాకు ఎలా అయితే మా అమ్మ నా సంరక్షణ బాధ్యతలు నెరవెర్చిందో. ఇప్పుడు నేను అలాంటి పాత్రను పోషిస్తున్నాను. చాలా రోజులు నా కూతురు విషయంలో అశ్రద్ద చేశానేమో అనే పాయింట్ వద్ద రియలైజ్ అయ్యాను.

  శ‌ృతిహాసన్‌‌ను నేనే‌ పెంచాను..

  శ‌ృతిహాసన్‌‌ను నేనే‌ పెంచాను..

  శృతిహాసన్‌కు 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి ఆమె సంరక్షణ బాధ్యతలు చూశాను. అప్పట్లో నా కూతురు సుబ్బలక్ష్మికి శృతిహాసన్‌కు మంచి రిలేషన్ ఉండేది. ఇప్పుడు కమల్‌తో విడిపోయిన తర్వాత వారి మధ్య సంబంధాలు అంతంతగానే ఉన్నాయి.

  క్యాన్సర్ బారిన పడటం

  క్యాన్సర్ బారిన పడటం

  నేను క్యాన్సర్ బారిన పడటం జీవితంలో నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్. 45 సార్లు రేడియేషన్ ప్రక్రియ జరిగింది. ఆ సమయంలోనే శృతిహాసన్‌ను అమెరికాలోని మ్యూజిక్ కాలేజీలో చేర్పించేందుకు వెళ్లాల్సి వచ్చింది. నడిచే ఓపిక లేకపోవడం వల్ల వీల్ చైర్‌లోనే ప్రయాణించాను. అలా వెళ్లడం నేను జీవితంలో మరిచిపోలేని సంఘటన.

  ఆమె కారణం కాదు..

  ఆమె కారణం కాదు..

  కమల్‌తో విడిపోవడానికి కారణం శ్రుతి హాసన్ కాదు. శృతిహాసన్ విపరీత జోక్యం వల్లే విడిపోవడం అనేది తప్పు. కమల్‌తో ఓ నటి చనువుగా ఉండటం కారణంగానే విడిపోయామనడం సరికాదు. అలాంటివి మా బ్రేకప్ కారణాలు కానేకావు. మా నిర్ణయం వెనుక ఎవరి ప్రభావం లేదు.

  పెళ్లి ఓ బాధ్యత

  పెళ్లి ఓ బాధ్యత

  ఇక భవిష్యత్‌లో పెళ్లి అనే వ్యవహారం ఉండదు.. ఇక సహజీవనం అనేది ఉంటుంది అనేది తప్పు. పెళ్లి గురించి తప్పుడు అవగాహన ఉన్నవాళ్లే అలా ఆలోచిస్తారు. పెళ్లి అనేది ఓ బాధ్యతాయుతమైన బంధం అని గౌతమి అన్నారు. నేటి తరానికి, పాతతరానికి మధ్య చాలా మార్పులు వచ్చాయి అని గౌతమి చెప్పారు.

  English summary
  After 13 years of live in relationship, Gautami Tadimalla and Kamal Hassan separated. Gautami is living separately after her break up with kamal. Recently she spoke to a youtube channel about her personal and professional life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X