Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
గౌతమ్ 'మిస్'?.. త్రివిక్రమ్ 'మిస్ ఫైర్'..: అలా జరిగి ఉంటే పవన్ సేఫ్ అయ్యేవాడు..
Recommended Video

కాపీ కథల్ని తెరకెక్కించడంలో మన దర్శకులు ఎంతటి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో ఇటీవలి కాలంలో ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు. తీరా దొరికిపోయాక.. కాపీ కథ కాదు ఏదో స్ఫూర్తి పొందామని కవర్ చేసుకుంటారు. కానీ సీన్ అప్పటికే జనాలకు అర్థమైపోతుంది.
ఇంతకీ విషయమేంటంటే.. కాపీ కంటెంట్‌తో ఒక అపప్రదను మూటగట్టుకున్నారు త్రివిక్రమ్. 'అజ్ఞాతవాసి'తో కాపీ వివాదం తెర పైకి రాగా.. ఆయన గత చిత్రాల అసలు మూలాలు కూడా హాలీవుడ్ లో ఉన్నాయన్న విమర్శలు ఎక్కువయ్యాయి. నిజానికి 'అజ్ఞాతవాసి' లాంటి సినిమాను గతంలోనే మరో దర్శకుడు తెరకెక్కించే ప్రయత్నం చేశాడన్న వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది.
'అజ్ఞాతవాసి'లో భారీ మార్పులు-చేర్పులు: 12ని. కత్తెర?, వెంకీ స్టిల్స్ అదిరిపోయాయి..

ఎవరా దర్శకుడు?:
తమిళ హీరో విజయ్‌తో దర్శకుడు గౌతమ్ మీనన్ అప్పట్లో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. 'యోహన్-అధ్యాయం ఒండ్రు' అనే టైటిల్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అసలు విషయమేంటంటే.. ఇప్పుడు త్రివిక్రమ్ ఏ సినిమాను కాపీ కొట్టాడని విమర్శలు ఎదుర్కొంటున్నారో.. అదే సినిమా(లార్గో వించ్) స్ఫూర్తిగా సినిమా తీద్దామనుకున్నాడట గౌతమ్ మీనన్.

మధ్యలోనే ఆగిపోయింది..:
స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకుని.. ఇక ప్రాజెక్ట్ పట్టాలెక్కడమే ఆలస్యం అనుకున్న తరుణంలో గౌతమ్ మీనన్-విజయ్ ల సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. బహుశా.. 'లార్గో వించ్' లైన్‌తో సినిమా చేస్తున్నామని తెలిస్తే.. కాపీ రైట్ సమస్యలు వస్తాయని ముందే ఊహించారేమో?

గౌతమ్ 'మిస్'.. త్రివిక్రమ్ 'మిస్ ఫైర్':
గౌతమ్ మీనన్ అంటేనే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. క్లాస్, మాస్ ఎలిమెంట్స్ రెండింటిని టచ్ చేస్తూ అద్భుతంగా సినిమా తీయగలడు.
కాబట్టి 'లార్గో వించ్' లైన్ తో గౌతమ్ మీనన్ గనుక సినిమా తీసి ఉంటే త్రివిక్రమ్‌లా కాకుండా మంచి ట్రీట్‌మెంట్‌తో తీసి ఉండేవాడేమో అన్న టాక్ కూడా ఉంది. మొత్తంగా గౌతమ్ ఈ సినిమాను మిస్ అయితే.. త్రివిక్రమ్ దాన్ని 'మిస్ ఫైర్' చేశాడనే చెప్పాలి.

త్రివిక్రమ్‌పై విమర్శలు:
మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం.. అసలు ఈ సినిమా గౌతమ్ మీనన్ ముందే తీసి ఉంటే 'అజ్ఞాతవాసి' నుంచి పవన్ సేఫ్ అయ్యేవాడనిbసోషల్ మీడియాలో వాపోతున్నారు. పవన్‌ను సరిగా చూపించనందుకు త్రివిక్రమ్‌పై చాలానే విమర్శలు చేస్తున్నారు.

కలెక్షన్స్ లెక్క?:
డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. 'అజ్ఞాతవాసి'కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాలో 'వెంకీ' సీన్స్ యాడ్ చేస్తే కలెక్షన్స్ నిలకడగా ఉండవచ్చునని అంటున్నారు. మరో 10,15రోజులు గడిస్తే తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద 'అజ్ఞాతవాసి' కలెక్షన్స్ ఎంతనే దానిపై క్లారిటీ రాదు. చూడాలి మరి ఫైనల్‌గా 'అజ్ఞాతవాసి' లాభాలే తీసుకొస్తుందో?.. నష్టాలే మిగులుస్తుందో?