twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గీత గోవిందం’ మరో స్టన్నింగ్ రికార్డ్... 402 థియేటర్లలో!

    By Bojja Kumar
    |

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం 12 రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసిన ఈచిత్రం ప్రేక్షకులతో పాటు ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరిచింది.

    తాజాగా 'గీత గోవిందం' మరో స్టన్నింగ్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ... అత్యధిక థియేటర్లలో ఈ మూవీ 25 రోజులు పూర్తి చేసుకోవడమే ఆశ్చర్యం.

    Geetha Govindam stunning feat

    ప్రపంచ వ్యాప్తంగా 402 థియేటర్లలో విజయం వంతంగా ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకున్నట్లు 'గీత గోవిందం' పీఆర్ టీమ్ ప్రకటించింది. ఇందులో 302 థియేటర్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, ఓర్సీస్ అన్నీ కలిపి 402 థియేటర్లలో సినిమా ప్రదర్శితం అవుతోంది.

    సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే ఈ చిత్రం ఇప్పటికే రూ. 110 కోట్లకు పైగా గ్రాస్ సాధించడంతో పాటు.... రూ. 62 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన ఆల్ టైమ్ టాప్ 15 సినిమాల్లో చోటు దక్కించుకుంది.

    గీత గోవిందం లేటెస్ట్ కలెక్షన్స్.. మామూలు విజృంభణ కాదు, షేర్ ఎంతో తెలిస్తే! గీత గోవిందం లేటెస్ట్ కలెక్షన్స్.. మామూలు విజృంభణ కాదు, షేర్ ఎంతో తెలిస్తే!

    ఇక ఈ సినిమాతో నటుడు విజయ్ దేవరకొండ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయాడు. 'పెళ్లి చూపులు' సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, 'అర్జున్ రెడ్డి'తో యూత్‌లో క్రేజ్ సంపాదించుకోగా... 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ విజయంతో స్లార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఈ విషయాన్ని 'గీత గోవిందం' వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించడం విశేషం.

    English summary
    Geetha Govindam makers are claiming that the film has pulled off a stunning feat. Apparently, PR team claims that the film is all set to complete its 25 day run in 402 theaters in India out of which 304 theaters are from Andhra Pradesh and Telangana itself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X