For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటించటం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు :"ఘాజి" తిరువీర్ (ఇంటర్వ్యూ )

  |

  ఘాజి సినిమా చూసారా? క్షణ క్షణం ఉత్కంఠ గా ఆ సబ్ మెరైన్ లో మనమూ తిరుగుతున్నట్టే ఉంటుంది. సుపీరియర్ ఆర్డర్ అందుకోగానే పరుగులు తీసే ప్రతీ పాత్రతోనూ మనమూ అక్కడే ఉంటాం. నిజంగా ఘజీ ఒక అద్బుతమైన సినిమా అనటం లో ఏ సందేహమూ లేదు. ఇప్పటికీ ఒక ఐటం ఐటం సాంగ్ లోనూ, రెండు ఫైట్లూ, కొన్ని పంచ్ డైలాగులూ ఇలా సాగిపోతున్న తెలుగు సినిమాకి కావాల్సిన ఒక బూస్ట్ ఇచ్చిన దర్శకుల్లో సంకల్ప్ నిలబడిపోతాడు.., ఘాజీ నిలబడిపోతుంది, ఘాజీ లో చేసిన క్షమించాలి జీవించిన నటులు కూడా...

  మొత్తానికి s21 (ఇండియన్ సబ్ మెరైన్) లో సుపీరియర్ ఆర్డర్ తీసుకొని "యస్సర్" అంటూ అటూ ఇటూ పరుగులు తీసే జూనియర్ స్టాఫ్ కుర్రాళ్ళంతా ఇండస్ట్రీ లో ఇంకా నిలదొక్కుకోని వాళ్ళే, ఒకటీ రెండు సినిమాల్లో ఒక్క ఫ్రేం లో అయినా తామేంటో నిరూపించుకోవాలన్న తపనతో కష్టపడ్డవాళ్ళే ఆ కుర్రాళ్ళలో ఇతన్నీ చూసుంటారు... పట్టుదలతో మెరిసే అతని కళ్ళనీ చూసుంటారు... " s21" డెప్త్ కంట్రోలర్ గా కనిపించిన "తిరు వీర్" మిమ్మల్ని కచ్చితంగా ఆకర్షించే ఉంటాడు. ఆ కళ్ళు మిమ్మల్ని వెంటాడుతూనే ఉండి ఉంటాయ్. యూట్యూబ్ లో షార్ట్ ఫిలింస్ ఫాలో అయ్యే వాళ్ళకి "కుమార సంభవం" లాంటి షార్ట్ ఫిలింస్ లోనూ కనిపించే ఉంటాడు... ఇంకా కొంతమదికి స్టేజ్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించి ఉంటాడు.... ఈ యువనటుడి గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం తిరువీర్ లోనూ ఒక సముద్రం కనిపిస్తుంది, అతనే ఒక సబ్మెరైన్ లా కనిపిస్తాడు. ఒక నటుడు తయారు కావటానికి కావాల్సినంత పెయిన్ ని మోసుకు తిరిగిన ఒక జీవితం కనిపిస్తుంది.... తిరు వీర్ తో ఈ వారం ఫిల్మీ బీట్ చిట్ చాట్ మీ కోసం....

   హలో తిరువీర్... సంతోషంగా ఉన్నట్టున్నారు ఘాజీ సంతృప్తినిచ్చినట్టేనా?

  హలో తిరువీర్... సంతోషంగా ఉన్నట్టున్నారు ఘాజీ సంతృప్తినిచ్చినట్టేనా?

  హ..హ..! సంతోషం లేకుండా ఎలా ఉంటుందీ.. ఈ రంగం లో ఒక సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ లో మనమూ ఒక పార్ట్ అయ్యాం అన్న ఆనందం కంటే వేరే పెద్ద ఆనందం కలిగించే విషయం ఉండదు కదా. నిజంగా చాలా రోజుల తర్వాత రెట్టింపు సంతోషం ఘాజీ ఇచ్చింది.

   మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కదా సినిమాల వైపు రావటానికే నాటకం లోకి వెళ్ళారా? సినిమాల్లోకి డైరెక్ట్ గా ఎప్పుడూ ట్రై చేయలేదా?

  మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కదా సినిమాల వైపు రావటానికే నాటకం లోకి వెళ్ళారా? సినిమాల్లోకి డైరెక్ట్ గా ఎప్పుడూ ట్రై చేయలేదా?

  అసలు నాటకమూ, సినిమా ఈ రెండూ ఒకదానికోసం ఒకటి అనుకుంటూ వచ్చాను. ఇంతకీ నా లైఫ్ లో ఇటువైపు రావటానికి గల మొదటి కారణం ఈ రొటీన్ జీవితాలు నచ్చకనే.. మహబూబ్ నగర్ జిల్లాలో మామిడి పల్లి మాఊరు. కొన్నాళ్ళు అక్కడే ఉన్నా మాన్నాన్న ఉధ్యోగరీత్యా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది పొద్దున్నే లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి 7 గంటలకే రావటం, మా ఇంట్లోనే కాదు చుట్టూ అందరి పరిస్థితీ ఇంతే..అందరికీ కావాల్సింది కాస్త రెస్ట్, ఆ రెస్ట్ తెచ్చేది ఆదివారం... ఆ ఒక్క రోజుకోసం మిగతా ఆరురోజులూ పని చేయటం అన్నట్టుగా ఉండే జీవితం అంటే భయం వేసింది. అందుకే పిచ్చిపట్టినట్టు చదివేవాన్ని అయితే కొన్నాళ్ళకి మళ్ళీ అనిపించింది ఇంత చదివి ఏదైనా జాబ్ వచ్చిందే అనుకుందాం ఏముంటుందీ మళ్ళీ ఇదే కదా ఆదివారం కోసం మిగతా ఆరు రోజులూ బతకటం... నో ఇది కాదు ఇంకా ఏదైనా వెరే గా ఉండాలి అనిపించేది. అయితే చదువుని మాత్రం పక్కన పెట్టలేదు ఒక ఆప్షన్ గా ఉంటుంది కదా అని, ఎప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి కిందకి దిగలేదు.

   దానికీ నటనకీ సంబందం ఏముందీ?వేరే ఏదైనా చేయొచ్చు కదా

  దానికీ నటనకీ సంబందం ఏముందీ?వేరే ఏదైనా చేయొచ్చు కదా

  లేదు ఇంకా ఉంది కదా సిటీ కాలేజ్ లో చదివేటప్పుడు చాలామంది ఫ్రెండ్ సలహా ఇచ్చారు మోడలింగ్ వైపు వెళ్ళమని అయితే చాలా సన్నగా ఉండేవాన్ని దాంతో మోడలింగ్ కూడా మనకు సూటవదనిపించింది. అప్పుడే ఫ్లైట్ స్టీవార్డ్ అనే జాబ్ ఉంటుందనీ దానికి ట్రై చేయమనీ చెప్పారు తెల్సిన వాళ్ళు. అదీ ట్రై చేసాను అయితే అక్కడ కూడా ఫీజులు భారీ గా ఉండటం తో వెళ్లలేకపోయాను ఆ కోర్స్ కోసం 60-70 వేలు భరించే పరిస్థితుల్లో లేదు అంతటి తో ఆ ఆశలు కూడా పోయినట్టే నెక్స్ట్ డిగ్రీ తర్వాత ఆప్షన్ ఏమిటా అని ఆలోచిస్తూ కూచునే వాన్ని. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడలింగే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. వెళ్ళి ఒక ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయిపోయా.

   ఆ తర్వాత నాటకం లోకి వచ్చారా?

  ఆ తర్వాత నాటకం లోకి వచ్చారా?


  అప్పటికీ ఇంకా యాక్టింగ్ అన్న ఆలోచన పెద్దగా రాలేదు. అదేసమయం లో ఒక చానెల్ వాళ్ళు మా ఇనిస్టిట్యూట్ కి వచ్చారు ఒకప్రోగ్రాం లో భాగంగా ఒక టాస్క్ ఇచ్చారు. దాన్లో నేను ఇరగ దీసాను, ఆ ప్రోగ్రాం అయ్యాక మా ఇనిస్ట్యూట్ హెడ్ అడిగారు "తిరు...! నువ్వు యాక్టింగ్ వైపు వెళ్ళొచ్చుకదా" అని. అప్పుడనిపించింది ఔనూ అసలు నేను యాక్తింగ్ ఎందుకు చేయకూడదూ అని.., అయితే ఎలా ట్రై చేయాలో తెలీదు, ఇండస్ట్రీ గురించి అస్సలు తెలీదు. అప్పుడు నాతో ఉండే ఇంకో ఫ్రెండ్ చెప్పిందేంటంటే. నాటకాలలో ట్రై చేయమంటూ సలహా ఇచ్చాడు. అప్పటివరకూ నాటకం అంటే ఊళ్ళో వేసే పౌరాణికాలు తప్ప ఏం తెలీదు. సరే ట్రై చేద్దాం అని వెళ్ళాను. అప్పటికీ ఎంత అమాయకత్వం అంటే కోర్స్ పేరులో థియేటర్ ఆర్ట్స్ అని ఉందీ, అంటే థియేటర్ లో సినిమాలే ఆడతాయని తెలుసు సో ఇక్కడ సినిమా కి సంబందించి నేర్పుతారన్న భ్రమ లోనే థియేటర్ ఆర్ట్స్ కి అప్లై చేసాను. జాయిన్ అయ్యాక అర్థమయ్యింది థియేటర్ ఆర్ట్స్ అంటే సినిమా గురించి కాదు నాటకం బేస్డ్ గా ఉండే కోర్స్ అని.

   సో నాటకం లో అలా మొదలయ్యిందన్న మాట జర్నీ

  సో నాటకం లో అలా మొదలయ్యిందన్న మాట జర్నీ

  హ..! అక్కడ కూడా నటన అన్నది మాత్రం నన్ను విపరీతంగా ఆకర్షించిన అంశం. నటుడు వినోద్‌బాలా మా గురువు గారు. ఆయన ఏ టాస్క్ ఇచ్చినా వెంటనే వెళ్ళిపోయేవాన్ని ఎందుకంటే అప్పటివరకూ నాకు విపరీతమైన సిగ్గు ఆఖరికి అన్నం తినాలన్నా ఎదురుగా కూచున్న వాళ్ళని చూస్తూ తినలేను కానీ యాక్టింగ్ అంటే అవన్నీ ఉండకూడదు. అలా మొదలై రోజుకి మూడు షిఫ్టుల్లో పని చేసేంత బిజీ అయిపోయాను.

   నిజంగా నాటకానికి ఇంత స్కోప్ ఉందా..?

  నిజంగా నాటకానికి ఇంత స్కోప్ ఉందా..?


  చాలామందికి తెలియని విషయం అదే., ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉండవు గానీ నాటకం లో విపరీతమైన ఆఫర్లు ఉంటాయి. చేయ్యాలనుకున్న వారికి 365 రోజులూ పని ఉంటుంది. ఆ క్రమం లోనే దాదాపు ఇండియా మొత్తం ట్రావెల్ చేసాను. ప్రతీ నగరం లోనూ షోలు చేసాను. ఒక విధ్యారణ్య స్కూల్లో సంవత్సరం పాటు థియేటర్ ఆర్ట్స్ టీచర్ గా పని చేసాను. దానికి ముందు రెయిన్ బో FM లో ఆర్జే గా చేసాను అదీ ఒక ఆరునెలల పాటే ఎందుకంటే..., సంతృప్తి లేదు నేననుకున్నది సినిమా అని కదా మరి ఇప్పుడు అటునాటకాల్లోనూ ఇటు సినిమాల్లోనూ లేకుండా ఇలా ఉండటం అంటే నచ్చలేదు.

   అసిస్టెంట్ డైరెక్టర్ :

  అసిస్టెంట్ డైరెక్టర్ :


  అప్పుడు నా ఎమ్మే థియేటర్ ఆర్ట్స్ లో నా సీనియర్ దగ్గరకు వెళ్ళాను ఆయన పేరు ఖాజాపాషా వెన్నెల కిషోర్ హీరో గా డాటర్ ఆఫ్ వర్మ అనే సినిమా తీసారాయన. దాని కోసం ఒక పిల్లాడికి ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది అలాగే అదే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా జాయిన్ అయిపోయాను. అక్కడా అదే పాత ఫీలింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా తప్ప యాక్టర్ గా గుర్తింపు లేదు. అందుకే ఆ తర్వాత వచ్చిన మరో పెద్ద సినిమాకి అసిస్టేంట్ డైరెక్టర్ గా చాన్స్ వచ్చినా చేయలేదు.

   అలా ఉంటూ కూడా చాన్సులు వెతకొచ్చుకదా... !?

  అలా ఉంటూ కూడా చాన్సులు వెతకొచ్చుకదా... !?

  నో..! మనం ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు అదే చేయాలి ఇంకోటి చేస్తూ ఇది ప్రయత్నిస్తా అంటే అదెప్పటికీ సాధించలేం. ఆ సమయం లోనే నా వర్క్ చూసిన భూమిక థియేటర్ ఉదయభాను గారు నన్ను సౌత్ కొరియా పంపించారు. ఇంటర్నేషనల్ రెసిడేనిసీ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందప్పుడే, బంగ్లాదేశ్, జపాన్, సౌత్ కొరియా, ఇండియా మొత్తం నాలుగు దేశాల థియేటర్ కళాకారులతో కలిసి పని చేసాను. అక్కడి నుంచి వచ్చాక ఒకరోజు ఫేస్బుక్ లో ఒక మెస్సేజ్ వచ్చింది. మీ ఫొటోలు చూసాను, మీ లుక్ నచ్చింది నా సినిమాలో యాక్ట్ చేస్తారా అని. అలా సినిమాల్లో కి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ తో అడుగు పెట్టాను

   మీ మొదటి సినిమా బొమ్మల రామారం గురించీ....

  మీ మొదటి సినిమా బొమ్మల రామారం గురించీ....

  అదే చెప్తున్నా ఆ మెసేజ్ చేసిందెవరో కాదు డైరెక్టర్ నిషాంత్ పూదరి .. కానీ సౌత్ కొరియా నుంచి వచ్చినప్పుడు అక్కడ అనుభవం తో ఒక ఊపులో ఉన్నాను నాటకాల్లో నే నా జీవితం అన్నంత ఫీలింగ్ లో ఉన్నాను. ఒక నాటికి హైదరాబాద్ నటకం అంటే గుర్తొచ్చే వాళ్ళలో నా పేరు కూడా ఉండాలి అనుకునే వాన్ని. దాంతో ఆ ఆఫర్ ని పట్టించుకోలేదు కానీ ఆయనా నన్ను వదిలిపెట్టలేదు.. కొన్నాళ్ళకి అనిపించింది ఏమిటీ గర్వం ఆయన అంత అడుగుతూంటే ఇలా ఎందుకుండాలి? అందులోనూ అది నేను కోరుకున్న సినిమా కదా అనిపించింది. నా గర్వానికి కాస్త సిగ్గేసింది కూడా.. అదే బొమ్మల రామారం సినిమా.., అక్కడినుంచీ మా జర్నీ మొదలయ్యింది ఆయన పడుతున్న కష్టం చూసాక ఇక అక్కడే ఆగిపోయాను.

   జుట్టూ గడ్డమూ తీసేయాలి...

  జుట్టూ గడ్డమూ తీసేయాలి...


  ఆ సినిమాకొసమే జుట్టూ, గడ్డం పెంచాను అప్పుడు అనుకోకుండా జరిగిన సంఘటన.... ఆరోజు పండక్కని ఇంటికి వెళ్ళాను మా అక్కా వాళ్ళూ వచ్చారు అంతా ఆనందంగా ఉంటుందనుకున్న సమయం లో హఠాత్తుగా మా నాన్న చనిపోయారు. సాంప్రదాయాల ప్రకారం ఆ జుట్టూ గడ్డమూ తీసేయాలి... నాన్న పోయిన భాదలో కూడా అదే నాకు మొదటగా గుర్తొచ్చిన విషయం. పెద్దవాళ్ళని అడిగాను నన్ను నమ్మి ఒకాయన లక్షలు పెట్టికూచున్నాడు.. ఈ గడ్దం జుట్టూ తీయకుండా ఉండే వీలుందా అని... అలా అయితే అసలు నువ్వు కర్మకాండ చెయ్యటానికే వీల్లేదు అన్నారు. ఏం అర్థం కాలేదు దైరెక్టర్ గారికి కాల్ చేసాను ఇదీ పరిస్థితి అని చెప్పటానికి.

   రిలీజ్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి:

  రిలీజ్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి:


  అంతా విన్నాక ఆయన అన్నారు సరే నువ్వు కర్మకాండ అవగానే వచ్చేయ్యి నీ పార్ట్ మొత్తం తీసేద్దాం పదోరోజున కదా అన్నీ తీయాల్సిందీ అన్నారు. అటునాన్నని పంపిస్తూనే ఇక్కడ షూట్లో పాల్గొన్నాను మళ్ళీ బాడీని పాతిపెట్టేసాక, ఆ తర్వాత మూడో రోజు కార్యక్రమం పూర్తయ్యాక మళ్ళీ షూట్ మొదలు. ఇటు యాక్ట్ చేస్తున్నా నరకంగా అనిపించేది. ఇంటిదగ్గర పరిస్థితీ, నాన్నా గుర్తొస్తూన్నా అందరి సహకారం తో పని పూర్తి చేసాం. అప్పటికీ నా సీన్లు కొన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది అయినా నాను ఏమీ అనకుండా సినిమా పూర్తి చేసారు. అయితే ఆ సినిమా కి రిలీజ్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి, నిజానికి ఆ పాత్ర వల్ల నాకు మంచి బ్రేక్ వస్తుందనుకున్న సినిమా అలా లేట్ గా రిలీజ్ అవటం వల్ల జనాల్లోకి వెళ్ళ లేక పోయింది.

   మరి ఘాజి లో చాన్స్ ఎలా వచ్చింది?

  మరి ఘాజి లో చాన్స్ ఎలా వచ్చింది?

  బొమ్మల రామారం అయ్యాక మళ్ళీ రొటీన్ లో పడ్దాను కొన్ని షార్ట్ ఫిలిమ్స్, నాటకాలూ ఇలా నడుస్తూన్నప్పుడే ఘాజి కి ఆడిషన్స్ జరుగుతున్నాయ్ అని తెల్సింది వెళ్ళాను సెలక్ట్ అయ్యాను. దీనికి ముందు చేతిదాకా వచ్చి నోటికందకుండా పోయిన చాన్సులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పేర్లు చెప్పలేం గానీ దాదాపు కొంత షూట్ అయ్యక కూడా సినిమా ఆగిపోయిన సంఘటనా ఉంది. అప్పుడప్పుడూ భాదేస్తుంది కానీ నాకు తెల్సు మనది కాదు అనుకున్నది ఇక ఎప్పటికీ మనకందదు.. మనకు దక్కాల్సింది మనకు దక్కకుండా పోదు ఎటొచ్చీ దాన్ని అందుకోవటానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతే.. ఇవాళ అదే ఘాజీ ఈ సినిమా నన్ను నిలబెట్టినట్టే అనుకుంటున్నాను ఇప్పుడు నామీద నాకు నమ్మకం మరింత పెరగటానికి కారణం. ఘాజీ సినిమా, అక్కడ నా చుట్టూ ఉన్న సినిమా యూనిట్ అంతే.

   అంటే ఇక నాటకాన్ని వదిలేసినట్టేనా? సినిమాలు మొదలయ్యాయి కదా.

  అంటే ఇక నాటకాన్ని వదిలేసినట్టేనా? సినిమాలు మొదలయ్యాయి కదా.

  నో అలా ఏం లేదు ఇప్పటికీ నాటకాలమీద వర్క్ చేస్తూనే ఉన్నాను. జీ తెలుగు లో శనివారం రాత్రి వచ్చే పిల్లల నాటకాల ప్రోగ్రాం డామా జూనియర్స్కీ వర్క్ చేస్తున్నాను, ఇప్పటికైతే ఇలా ఉందుఇ జీవితం.

   సరే నాటకాల్లో అయితే దేశం మొత్తం తిరిగారు కదా.., అలానే సినిమాల్లో కూడా వేరే భాషా ఇండస్ట్రీల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఉందా..

  సరే నాటకాల్లో అయితే దేశం మొత్తం తిరిగారు కదా.., అలానే సినిమాల్లో కూడా వేరే భాషా ఇండస్ట్రీల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఉందా..

  నేనొక ఆర్టిస్ట్ ని ఒక భాష అని అనుకోలేను అలా అని నా సొంత భాషనీ వదులుకోలేను. అయితే బాలీవుద్ లో కూడా నటించాలన్నది నాకల చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది కాదు పక్కింట్లో చూఏవాన్ని వాళ్ళు హిందీ సినిమాలు చూస్తూ నవ్వుకునే వాళ్ళు అక్కడ వచ్చే సీన్లకి రియాక్ట్ అయ్యేవాళ్ళు కానీ నాకు అర్థమయ్యేది కాదు అందుకే హిందీ నేర్చుకోవాలనుకుని ఎక్కువగా హిందీ చదివేవాన్ని చూడాలన్నా హిందీ సినిమాలే చూసేవాన్ని అలా బాలీవుడ్ మీద కూడా నాకూ ఇష్టం పెరిగిపోయింది. ఎప్పటికైనా బాలీవుడ్ లో నటించాలనుకున్నాను. ఇదిగో ఘాజీ తో ఆ కలకూడా సగం నెరవేరినట్టే. బాలీవుడ్ కలకి మొదటి మెట్టు ఇక్కడ పడింది...

   అంటే తర్వాత టాలీవుడ్ లో ఉండరన్న మాట...

  అంటే తర్వాత టాలీవుడ్ లో ఉండరన్న మాట...

  అదెలా అంటారు? బాలీవుడ్ లో ఉన్న నటులు కూడా వేరే భాషల్లో నటిస్తున్నారు అంత మాత్రాన వాళ్ళు తమ సొమంత ఇండస్ట్రీని వదిలేస్తున్నారన్నట్టా? తమిళ్ నుంచీ, బాలీవుడ్ నుంచీ మన సినిమాల్లోను ఎంతో మంది నటులు కనిపిస్తూనే ఉన్నారు అంత మాత్రాన వాళ్ళు ఇక్కడికి వలస వచ్చేసారు అనలేం కదా. నాకు నటన అంతే ఇష్టం బాలీవుడ్ సినిమా ప్యాషన్ కానీ టాలీవుడ్ నా ప్రదేశం నేను ఏం చేసినా, చేయగలిగినా తెలుగు సినిమానే కదా. టాలీవుడ్ ని వదిలేయటం అనే మాట తర్వాత.. అసలు ముందు ఇక్కడ కూడా నిలదొక్కుకోవాలి కదా. అప్పుడు చూద్దాం.

  బాగా నిరాశపడ్ద సంఘటనలేమన్నా ఉన్నాయా? అంటే నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదేమో యాక్టింగ్ కాకుండా ఒక సెక్యూర్డ్ జాబ్ చూసుకునుటే బావుండేదేమో... అలా అనిపించిందా?

  బాగా నిరాశపడ్ద సంఘటనలేమన్నా ఉన్నాయా? అంటే నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదేమో యాక్టింగ్ కాకుండా ఒక సెక్యూర్డ్ జాబ్ చూసుకునుటే బావుండేదేమో... అలా అనిపించిందా?

  ఒక్కసారి కాదు ఒక్క చాన్స్ చేతివరకూ వచ్చి మిస్సయిన ప్రతీసారీ అదే అనిపిస్తుంది. అసలునేను యాక్టింగ్ కి పనికి రానేమో అసలు ఎప్పటికీ నేను సక్సెస్ కానేమో అనిపిస్తుంది. అయితే అది కొద్దిసెపే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డప్పుదో, సింగిల్ గా ఉన్నప్పుడో అలా ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్గ్ నుంచి త్వరగానే బయట పడుతూంటా. అప్పుడు ఒకటే అనిపిస్తుంది నేను మొదటి నుంచీ డిటింక్షన్ స్టూడెంట్ ని ఎప్పుడూ నా మార్కులు మోర్ ద్యాన్ 75 పర్సెంటే కానీ నాకు జాబ్ చేయాలనిపించదు చెప్పాకదా ఒక్క ఆది వారం కోసం ఎదురు చూసే జీవితం వద్దనుకున్నాను అంటే రెగ్యులర్ జాబ్ కాకుండా వేరే ఏదైనా చేయాలి ఆ వేరే ఏదైనా లో నేను చేయగలిగింది యాక్టింగ్ ఒక్కటే నటించటం తప్ప ఇంకేం చేయలేను కాబట్టి చావైనా రేవైనా ఇక్కడే కదా అనుకుంటా అప్పుడు నిరాశా, గిరాశా అన్నీ చల్ హట్ అన్నట్టు వెళ్ళిపోతాయ్.

   ఇప్పటివరకూ మీరు రావటానికి చేసిన జర్నీలో మీరు గుర్తు చేసుకునే మనుషులెవరన్నా ఉన్నారా?

  ఇప్పటివరకూ మీరు రావటానికి చేసిన జర్నీలో మీరు గుర్తు చేసుకునే మనుషులెవరన్నా ఉన్నారా?

  మొదటగా చెప్పుకోవాల్సింది మా థియేటర్ ఫ్యామిలీ నే డాక్టర్ కోట్ల హనుమంత రావు గారూ, డాక్టర్ పద్మ ప్రియగారూ, వినోద్ బాలా గారూ, మా డాక్టర్ పెద్దిరామారావు గారూ ఇలా ఒకరూ ఇద్దరూ అనేముంది చాలామందే ఉన్నారు ఇదంతా మ్యా ఫ్యామిలీ. ఇక సౌధా అరుణ గారు నాకో గైడ్ అనుకోవాలి వాళ్ళే నన్నింత కాలం సొంత పిల్లవాడిలా చూసుకున్నది. HCU డిపార్త్ మెంట్ అల్తాఫ్, బషీరన్నా, చిల్డ్రన్ థియేటర్ వాళ్ళూ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం లో ఉన్న ప్రతీ మనిషికీ నేను కృతఙ్ఞతలు చెప్పుకోవాలి.

   నాటకాల్లో చాలా రోజులే ఉన్నారు కదా... నాటకాల్లో నటించటమేనా లేదంటే మీకంటూ ఒక సంస్థ ఏదైనా ఉందా?

  నాటకాల్లో చాలా రోజులే ఉన్నారు కదా... నాటకాల్లో నటించటమేనా లేదంటే మీకంటూ ఒక సంస్థ ఏదైనా ఉందా?

  అప్పటిదాకా మామూలుగా నటించటం మాత్రమే ఉండేది కానీ 2014 లో మాకూ ఒక టీం ఉండాలనిపించింది. నేనూ,నాతో పాటు ఇప్పటి యువఆర్టిస్ట్ లంతా కలిసి పాప్ కార్న్ థియేటర్ అనే ఒక టీమ్ గా ఏర్పడ్డాం. అమ్మ చెప్పిన కథ, నా వల్ల కాదు , దావత్, ఇలా కొన్ని నాటకాలని ప్రదర్శిస్తూనే ఉన్నాం. స్పెషల్లీ దావత్ అనే నాటిక విజయ వాడ విశాఖ, హైదరాబాద్ లలో కూడా ప్రదర్శించాం. ఈ నాటకానికి చాలా మంచి పేరొచ్చింది...

   ఘాజీ తర్వాత వచ్చే పాత్రలు ఎలాంటివి ఎంచుకోవాలనుకుంటున్నారు? హీరోగా మాత్రమే నిలబడాలని ఉందా లేకా....

  ఘాజీ తర్వాత వచ్చే పాత్రలు ఎలాంటివి ఎంచుకోవాలనుకుంటున్నారు? హీరోగా మాత్రమే నిలబడాలని ఉందా లేకా....

  హీరోగా కంటే నన్నొక క్యరెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నప్పుడే ఆనందంగా ఉంటుందేమో...! మీరు బాలీవుడ్ లో చూసినట్తైతే బౌమన్ ఇరానీ, ఇర్ఫాన్ ఖాన్ లాంటి నటులని వీళ్ళు హీరోలా, విలన్ లా అంటే ఏం చెప్తారు ఎలా కావాలంటే లా వాడుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో రానా కూడా అలానే ఉండబోతున్నారనిపిస్తుంది. నేనూ అలా నటున్ని అనిపించుకోవాలనే ఆశ. మొదటినుంచీ కూడా నటుడవ్వాలనే అనుకున్నాను తప్ప హీరో అవ్వాలీ అనుకొని రాలేదు కదా...

  షార్ట్ ఫిలి కూడా చేసినట్టున్నారు కదా...

  హ..హ..! అవును నటన అనే వ్యసనం అంటుకున్నాక అదీ ఇదీ అని ఏం ఉండదు మంచి పాత్ర అనేది పెద్ద సినిమాలో మాత్రమే ఉంటుందీ అని అనుకోలేం కదా, నాటకం లో అయినా, చిన్న సినిమాలో అయినా, షార్ట్ ఫిలిమ్ అయినా ఒక పాత్ర మనం చేయగలం అనుకున్నప్పుడు ఆగలేం. అలా చేసిన వాటిల్లో అతలకుతలపాతాలం నాకు మంచి పేరు తెచ్చ్ఘిన సినిమా దీనిడైరెక్టర్ స్రవంత్ పండ్రంగి, దాని తర్వాత మళ్ళీ అంతటి పేరు తెచ్చింది రిషీ సినిమాస్ బ్యానర్ లో తీసిన కుమారసంభవం దీని డైరెక్టర్ విజయ్ శేఖర్ కూడా అద్బుతమైన విజన్ ఉన్నవాడు. ఇక ఈమధ్య చేసిన సినిమా కలర్స్., శిద్దార్థ్ మోటూరి, శాంతన్ రెడ్డి ఈ ఇద్దరూ తీసిన సినిమా నాకు మరింత సంతృప్తినిచ్చిన పాత్ర .

  English summary
  Tiruveer who Acted in Gajula Ramaram and Latest Ghazi Shared some movements in his journey with theater to Movies
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X