For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కిట్టూ జాగ్రత్త పడ్దాడు, గుంటూరోడు వెనక్కి తగ్గాడు: ఘాజీ ఎఫెక్ట్ ఇలాఉంది మరి

  |

  విడుదలకు ముందు ఇదెంతా అని చప్పరించినవాళ్ళే ఇప్పుడు ఘాజీ ని చూసి ఆశ్చర్య పోతున్నారు. ఒకే ఒక్క నెలలో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. ఒక మమూలు సినిమా అనుకున్నది కాస్తా స్టార్ హీరోల సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఒక్కసారి అహి రెంజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సాధించేసింది.

  ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ .. అతుల్ కులకర్ణి .. రాహుల్ సింగ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలుగులో సైతం ఈ సినిమాకు మంచి హైప్ ఉండటంతో దీనికి పోటీ వెళ్లడం ఎందుకనుకున్నారో ఏమో.. మిగతా రెండు సినిమాల్ని వాయిదా వేసేశారు. ఇంతకీ ఆ రెండు సినిమాలూ ఏవన్నవి అర్థమైపోయి ఉంటుంది.. విషయం లోకి వెల్తే

  భారత్ - పాకిస్థాన్ :

  భారత్ - పాకిస్థాన్ :

  1970లో భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో తెలుగులో తొలిసారిగా వస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. గత కొంత కాలంగా ఘాజి పేరు చర్చనీయాంశమవుతోంది. 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇండియాలో తెరకెక్కిన తొలి సబ్ మెరైన్ వార్ మూవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంది.

  భారతీయ నౌకాదళం:

  భారతీయ నౌకాదళం:

  బాహుబలి తర్వాత రానా నటించిన చిత్రం కావడం, మొత్తం నీటి అడుగున తీసిన చిత్రంగా నిలవడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. 1971లో జరిగిన భారత-పాకిస్థాన్‌ యుద్ధంలో భారతీయ నౌకాదళం కీలక పాత్ర పోషించింది.

   పాక్‌ సైన్యం:

  పాక్‌ సైన్యం:

  విశాఖపట్నంలోని ఈస్ట్రన్‌ కమాండ్‌ అధీనంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత అనే యుద్ధ నౌకపై దాడి చేసి మన నౌకాదళాన్ని దెబ్బతీయటానికి.. పాకిస్థాన్‌ పీఎన్‌ఎస్‌ ఘాజీ అనే ఒక జలాంతర్గామిని విశాఖపట్నానికి పంపింది.అప్పట్లో పాక్‌ దగ్గర నాలుగు జలాంతర్గాములు ఉండేవి. ఐఎన్‌ఎస్‌ విక్రాంతను దెబ్బతీయగలిగితే.. యుద్ధంలో పై చేయి సాధించవచ్చని పాక్‌ సైన్యం చాలా ఆశలు పెట్టుకుంది.

  ఐఎన్‌ఎస్‌ విక్రాంత:

  ఐఎన్‌ఎస్‌ విక్రాంత:

  ఐఎన్ఎస్ ఘాజీ అత్యంత రహస్యంగా.. భారతీయ నౌకలకు చిక్కకుండా విశాఖపట్నం సమీపానికి చేరుకుంది.కానీ అప్పటికే ఐఎన్‌ఎస్‌ విక్రాంత విశాఖతీరాన్ని వదిలివెళ్లిపోయింది. దీంతో ఒక ప్రత్యేకమైన లక్ష్యం లేని ఘాజీ.. విశాఖపట్నం సమీపంలో ఉన్న నౌకలపై దాడులు చేయటానికి విఫలయత్నాలు చేసింది. చివరికి ఆ నౌకే పేలిపోయింది.

   ఘాజీ శకలాలు దొరికాయి:

  ఘాజీ శకలాలు దొరికాయి:

  1971 డిసెంబర్‌ 3వ తేదీన ఐఎన్‌ఎస్‌ అక్షయ్‌ అనే యుద్ధ నౌక పహారా కాయడానికి వెళ్లినప్పుడు ఘాజీ శకలాలు దొరికాయి.మరి ఘాజీని మన వాళ్లే పేల్చారా.. దానంతట అదే పేలిపోయిందా అన్నదానిపై స్పష్టత లేదు. తాము ఘాజీని పేల్చివేశామని మన నౌకాదళం ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. ఐతే ‘ఘాజీ' సినిమాలో మాత్రం మన నౌకా దళమే ఘాజీని పేల్చేసినట్లు చూపిస్తారని అర్థమైంది. ఈ ఘాజీ కథకు సంబంధించి ఐదు రకాల వెర్షన్లు ఉన్నాయట. ఐతే వాటన్నింటినీ గుదిగుచ్చి.. సంకల్ప్ ఈ కథ తయారు చేశారు.

  అంచనాలను పెంచేశారు:

  అంచనాలను పెంచేశారు:

  "యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, శత్రువు ప్రాణాలు తీసేయడమంటూ అదరిపోయే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌, ఆ తరువాత అందరి కళ్లు కప్పి పాకిస్తాన్‌ ఘాజీ సబ్‌మెరైన్‌ను విశాఖ సముద్రంలో ప్రవేశపెట్టడం, దాన్ని పట్టుకునేందుకు రానా నేతృత్వంలోని ఒక టీమ్ ప్రయత్నించడాన్ని" చూపించారు. అంతేకాదు ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు.

  గుంటూరోడు:

  గుంటూరోడు:

  ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం ఆరు నెలల ముందే విడుదల తేదీ ఖరారు చేసుకుంది. కానీ గత నెలలో ఉన్నట్లుండి రాజ్ తరుణ్ సినిమా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త'ను కూడా ఇదే తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మంచు మనోజ్ సినిమా ‘గుంటూరోడు' కూడా ఫిబ్రవరి 17కే ఫిక్సయింది. కానీ ఇప్పుడా రెండు సినిమాలు పక్కకు తప్పుకున్నాయి.

   కరణ్ జోహార్:

  కరణ్ జోహార్:

  ‘ఘాజీ' గురించి ముందు చాలామంది తక్కువగా అంచనా వేశారు కానీ.. ఈ సినిమా ట్రైలర్.. ఆ తర్వాతి మేకింగ్ వీడియోలు అవీ చూస్తే ఇది మామూలు సినిమా కాదని అర్థమైంది. ఇండియాలో తెరకెక్కిన తొలి సబ్ మెరైన్ వార్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ‘ఘాజీ'ని హిందీలో కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత రిలీజ్ చేస్తున్నాడు.

  సెన్సేషనల్ హిట్:

  సెన్సేషనల్ హిట్:

  బాలీవుడ్లో సైతం ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తుండటంతో ‘ఘాజీ' మీద బజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టవుతుందేమో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులో సైతం ఈ సినిమాకు మంచి హైప్ ఉండటంతో దీనికి పోటీ వెళ్లడం ఎందుకనుకున్నారో ఏమో.. మిగతా రెండు సినిమాల్ని వాయిదా వేసేశారు.

  English summary
  Kittu Unnadu Jagratha and Gunturodu were supposed to release on the same day when ghazi is Hitting the screans but now the buzz is that those films are going to be postponed. If that happens, then it would be a solo release for Rana.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X