»   » త్వరలో సంకల్ప్‌ రెడ్డి తదుపరి చిత్రం.. జోరుగా అడివి సాయికిరణ్ సినిమా

త్వరలో సంకల్ప్‌ రెడ్డి తదుపరి చిత్రం.. జోరుగా అడివి సాయికిరణ్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మిస్టర్‌ పెళ్లాం', 'శ్రీకారం' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ చాముండీ చిత్ర చాలా విరామం తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించనుంది. ఈ సంస్థ అధినేత గవర పార్థసారధి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. ఒకటి అడివి సాయికిరణ్‌ దర్శకత్వంలో మరొకటి సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన విశఏసాలను పార్థసారధి వెల్లడించారు.

గవర పార్థసారధి నిర్మాణ సారథ్యంలో..

గవర పార్థసారధి నిర్మాణ సారథ్యంలో..

‘వినాయకుడు', ‘విలేజ్‌లో వినాయకుడు', ‘కేరింత' వంటి చిత్రాల ద్వారా దర్శకుడు అడివి సాయికిరణ్‌ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో అడివి శేష్‌ హీరోగా గవర పార్థసారధి నిర్మిస్తోన్న చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ త్వరలో ఆరంభం కానుంది.

త్వరలో నటీనటుల వివరాలు

త్వరలో నటీనటుల వివరాలు

అడివి సాయికిరణ్ దర్శకత్వంలో మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలో వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నది.

ఘాజీ తర్వాత తదుపరి చిత్రం

ఘాజీ తర్వాత తదుపరి చిత్రం

ఇండియన్‌ ఫస్ట్‌ సబ్‌మెరైన్‌ మూవీ ‘ఘాజి' ద్వారా జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంకల్ప్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో ఓ సెన్సేషనల్‌ మూవీ నిర్మించడానికి గవర పార్థసారధి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఓ ప్రముఖ యువకథానాయకుడు ఈ చిత్రంలో నటించనున్నారు.

రానా కెరీర్‌లో సంచలన చిత్రంగా..

రానా కెరీర్‌లో సంచలన చిత్రంగా..

బాహుబలి తర్వాత రానా దగ్గుబాటి హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘాజీ చిత్రం సంచలన విజయం సాధించింది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. జాతీయ స్థాయిలో ఈ చిత్రానికి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Mister Pellam, Srikaram movie producer Gavara Partha Sarathi is producing another two movies in a row. One movie on sets by Adavi Sai Kiran direction. Another is movie under Ghazi fame Director Sankalp Reddy. In this occassion, Partha sarathi reveals movie details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu