»   » ఏ సర్టిఫికెట్ ఇవ్వండి చాలు : సెన్సార్ బోర్డ్ కి "లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా" పంచ్

ఏ సర్టిఫికెట్ ఇవ్వండి చాలు : సెన్సార్ బోర్డ్ కి "లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా" పంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతేడాది ఉడ్తా పంజాబ్ విషయంలో జరిగిన హంగామా చూశాం. ఇప్పుడు 'లిప్ స్టిక్ అండర్ మై బురఖా' మూవీ విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఈ మూవీకి అభ్యంతరకరమైన సన్నివేశాలు.. అసభ్యమైన దృశ్యాలు.. వినలేని స్థాయిలో సంభాషణలు ఉన్నాయంటూ.. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సీబీఎఫ్సీ నిరాకరించింది.మహిళా దర్శకురాలు అలకృత శ్రీవాస్తవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిరాకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.

సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్

సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్

ఇటీవల కాలంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అనేక వివాదాల్లో కూరుకుపోతున్నది. ఉడ్తా పంజాబ్ విషయంలో సెన్సార్ తీరు అభ్యంతరకరంగా మారింది. అలాగే ఆస్కార్ అవార్డు గెలుచుకొన్న మూన్‌లైట్ చిత్రంలోని పలు సన్నివేశాలపై కట్స్ వేయాలని అధికారులు చెప్పడం మరోసారి వివాదాస్పదమైంది.

లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా

లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా

ఇవన్ని ఒకటైతే తాజాగా లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా అనే చిత్రంపై నిషేధం విధించడం మరోసారి సెన్సార్ అధికారుల తీరు వెలుగులోకి వచ్చింది. మహిళా ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో అశ్లీల పదాలు ఉన్నాయన్న కారణంతో సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.

సెన్సార్ బోర్డ్ సీఈఓ

సెన్సార్ బోర్డ్ సీఈఓ

స్త్రీ వాద సినిమా కావడం వల్లనే ఈ సినిమాపై వివక్ష చూపుతున్నారనే వాదనను.... సెన్సార్ బోర్డ్ సీఈఓ అనురాగ్ శ్రీవాస్తవ్ ఖండించారు. రెండు కమిటీలు సినిమాను చూసాయి. సినిమాను చూసిన వారిలో ఐదుగురు స్త్రీలు కూడా ఉన్నారు. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వొద్దని ఆ ఐదుగురు కూడా సిఫారసు చేసారు అని తెలిపారు.

ప‌హ‌ల‌జ్ నిహ‌లానీ

ప‌హ‌ల‌జ్ నిహ‌లానీ

సినిమాకు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని బోర్డు చైర్మ‌న్ ప‌హ‌ల‌జ్ నిహ‌లానీ స‌మ‌ర్థించుకున్నారు. చిత్రంలో అభ్యంత‌ర‌క‌ర అశ్లీల దృశ్యాలు ఉన్నాయ‌న్నారు. సెన్సార్ బోర్డు నియ‌మాల‌ను తాను పాటిస్తున్న‌ట్లు నిహ‌లానీ తెలిపారు. అశ్లీల చిత్రాల‌ను తాను ఏమాత్రం స‌హించ‌బోన‌న్నారు.

ఫెమినిస్ట్ క‌థాంశం

ఫెమినిస్ట్ క‌థాంశం

అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు తొలిగించిన త‌ర్వాత చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు అంగీక‌రిస్తామ‌న్నారు. ఫెమినిస్ట్ క‌థాంశంతో రూపొందించిన 'లిప్‌స్టిక్ అండ‌ర్ మై బుర్ఖా' చిత్రానికి ప్ర‌కాశ్ షా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. టైటిల్‌తో త‌న‌కు ఏమాత్రం సంబంధం లేద‌ని సెన్సార్ బోర్డు చైర్మ‌న్ తెలిపారు.

అశ్లీల చిత్రాల‌కు సెన్సార్ బోర్డు అనుమ‌తి

అశ్లీల చిత్రాల‌కు సెన్సార్ బోర్డు అనుమ‌తి

గ‌తంలో అనేక చిత్రాలు అశ్లీల దృశ్యాల విష‌యంలో సెన్సార్ బోర్డు నుంచి త‌ప్పించుకున్నాయ‌ని, ఈసారి మాత్రం అలా జ‌ర‌గ‌ద‌న్నారు. అవినీతి వ‌ల్లే గ‌తంలో అశ్లీల చిత్రాల‌కు సెన్సార్ బోర్డు అనుమ‌తి ద‌క్కింద‌ని, ఇప్పుడు అలాంటి ఘ‌ట‌న‌ల‌కు ఆస్కారం ఉండ‌ద‌న్నారు.

సోష‌ల్ మీడియా

సోష‌ల్ మీడియా

లిప్‌స్టిక్ అండ‌ర్ మై బుర్ఖా చిత్రంపై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను కూడా నిహ‌ల‌నీ త‌ప్పుప‌ట్టారు. సోష‌ల్ మీడియాకు సెన్సార్ బోర్డును ప్ర‌శ్నించే హ‌క్కులేదన్నారు. సాధార‌ణంగా సినిమాల‌కు యూ లేదా ఏ స‌ర్టిఫికెట్ ఇస్తారు. అవ‌స‌ర‌మైతే కొన్ని సీన్లు క‌ట్ చేస్తారు.

 శ్యామ్ బెనగల్ కూడా

శ్యామ్ బెనగల్ కూడా

కానీ ఈ సినిమాకు స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాక‌రించింది. అయితే సర్టిఫికెట్ ఇవ్వకపోవడం పట్ల ఫిల్మ్ సంఘాలు సెన్సార్ బోర్డు పై మండిపడ్డాయి. మేటి డైరక్టర్ శ్యామ్ బెనగల్ కూడా బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టారు. అయినా పంకజ్ నిహలానీ అభిప్రాయం మారక పోవటం తో.

సీబీఎఫ్సీకి మరో ఎదురుదెబ్బ

సీబీఎఫ్సీకి మరో ఎదురుదెబ్బ

ఈ మూవీ మేకర్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. చివరకు.. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ.. ట్రైబ్యునల్ ఆదేశించింది. అదే సమయంలో.. చిత్రం నుంచి శృతి మించి ఉన్న కొన్ని సన్నివేశాలను.. మాటలను స్వచ్ఛందంగా తొలగించాలని మేకర్స్ కూడా సూచించింది అప్పిలేట్ ట్రైబ్యునల్. ఈ ఆదేశంతో సీబీఎఫ్సీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా

లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా

కొంకణా సేన్.. రత్నా పాఠక్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని అలంకిత శ్రీవాస్తవ దర్శకత్వంలో ప్రకాష్ ఝా నిర్మించారు. మహిళా ప్రాధాన్యత ఉన్న తమ చిత్రం.. వారి కలలకు ప్రతిరూపం అన్న కొంకణా సేన్.. లిప్ స్టిక్ అండర్ మై బురఖా మూవీకి సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

English summary
Film Certification Tribunal Orders CBFC To Give Lipstick Under My Burkha An 'A' Certificate
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu