twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసులతో వర్మ దిగ్భంధనం.. ఊపిరి మెసలకుండా పెట్టిన సెక్షన్లు.. వారెంట్ లేకుండానే..

    By Rajababu
    |

    నిరంతరం సంచలనాల మధ్య ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్ర వివాదంలో కూరుకుపోయాడు. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా రూపొందించారనే అభియోగాలపై వర్మపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా వర్మ వెల్లడించిన విషయాలు వాస్తవాలకు దూరంగా ఉన్నట్టు వెల్లడైనట్టు సమాచారం. ఈ విషయంలో వర్మ అరెస్ట్ ఖాయమమనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనపై పెట్టిన కేసులు ఇవే..

    Recommended Video

    GST : Police Getting Ready to Arrest RGV
     వారెంట్ లేకుండా అరెస్ట్

    వారెంట్ లేకుండా అరెస్ట్

    జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీ వివాదంలో రాంగోపాల్ వర్మపై పెట్టిన కేసుల్లో క్రిమినల్ ప్రొసిజర్ కోడ్, 1973 సెక్షన్ ప్రకారం.. దోషిగా తేలితే.. ఆరోపణలు రుజువైతే ఏ వ్యక్తినైనా వారెంట్ జారీ చేయకుండా అరెస్ట్ చేయవచ్చు.

     అక్రమంగా సమాచారం చేరవేత

    అక్రమంగా సమాచారం చేరవేత

    41 సెక్షన్ ప్రకారం.. చట్టాలకు అతీతంగా ఏదైనా సమాచారాన్ని స్వీకరించినా.. లేదా బయటకు పంపినా నేరం చేసిన వారిగా పరిగణింపబడుతారు. ఈ సెక్షన్ చాలా తీవ్రమైనది. దాదాపు ఈ సెక్షన్ కింద కేసు నమోదైన వారు బయటపడిన దాఖలాలు లేవనే మాట పోలీసుల వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

     అశ్లీల కంటెంట్‌ను

    అశ్లీల కంటెంట్‌ను

    జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీ వివాదంలో రాంగోపాల్ వర్మపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 కింద మరో కేసు నమోదైంది. ఎలక్ట్రానిక్ రూపంలో ఏదైనా సమాచారాన్ని ప్రచురించినా.. ఇంటర్నెట్ ద్వారా విదేశాలకు చేరవేసినా లేదా అశ్లీల కంటెంట్‌ను వేరే ప్రాంతానికి చేరవేసినా వ్యక్తి శిక్షార్హులుగా పరిగణింపబడుతారు.

     వర్మ అరెస్టుకు ఆధారాలు ఇవే

    వర్మ అరెస్టుకు ఆధారాలు ఇవే

    41 సెక్షన్, ఐటీ యాక్ట్ 2000 అనుగుణంగా రాంగోపాల్ వర్మ జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీని నిబంధనలకు విరుద్ధంగా స్వదేశంలోనే డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ నుంచే అప్‌లోడ్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు వార్తలు వస్తున్నాయి. అదే గనుక నిజమైతే ఆయన అరెస్ట్ తప్పదేమో..

     అసభ్య పదజాలంతో దూషించినట్టు

    అసభ్య పదజాలంతో దూషించినట్టు

    అశ్లీల పదజాలం, అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలపై రాంగోపాల్ వర్మపై నమోదైన మరో కేసు నమోదైంది. సామాజిక కార్యకర్తలు దేవీ, మణి చేసిన ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్ 506, 509 సెక్షన్ల కింద వర్మపై కేసు బుక్ చేశారు.

     బెట్టు వీడని సామాజిక కార్యకర్తలు

    బెట్టు వీడని సామాజిక కార్యకర్తలు

    జీఎస్టీ విడుదలకు ముందు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తమకు సారీ చెప్పినా సహించబోమని సామాజిక కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ వివాదంలో వారి కేసు కూడా బలంగా ఉండే అవకాశం ఉంది.

     జీఎస్టీని నిషేధించాలి

    జీఎస్టీని నిషేధించాలి

    అశ్లీల, అసభ్యకరమైన రీతిలో రూపొందించిన జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీని దేశంలో నిషేధించాలి. ఇంటర్నెట్ నుంచి దానిని తొలగించాలి అని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

    సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా

    సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా

    సెన్సార్ బోర్డు నిబంధనలు తుంగలో తొక్కడమే లక్ష్యంగా జీఎస్టీని రాంగోపాల్ వర్మ రూపొందించారు. అశ్లీలంగా చిత్రీకరించేందుకు మహిళను ఓ వస్తువుగా ఉపయోగించాడు. అంతేకాకుండా పోర్నోగ్రఫి (అశ్లీల చిత్రాలను) ప్రమోట్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడనే సామాజిక కార్యకర్తలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    English summary
    Director Ram Gopal Varma on Saturday appeared before Hyderabad police in connection with a case of obscenity booked against him for his film God, Sex and Truth, and also for allegedly insulting the modesty of a woman.The filmmaker, whose controversial movie with American porn star Mia Malkova hit the internet last month, appeared before the officials of Central Crime Station (CCS) in response to the notice served on him. These are the sections filed on Varma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X