మహానటి సినిమాకు వారి ప్రశంశలు ఈ నెల 9న విడుదల!
తెలుగు సినిమా గర్వించదగ్గ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా సావిత్రి భర్తగా దుల్కర్ సల్మాన్ నటించడం జరిగింది.
మహానటి సినిమాలో సమంత మరియు షాలిని పాండే ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. మహానటి సినిమాను అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్, అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో తొలి బయోపిక్ సావిత్రిదే అవ్వడం విశేషం.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న మహానటి సినిమాకు క్లీన్ యు సట్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా మహానటి సినిమా ఉండబోతోందని చిత్ర నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











