»   » ‘గోపాల గోపాల’ కేసు: లైట్ తీస్కుంటున్నారు!

‘గోపాల గోపాల’ కేసు: లైట్ తీస్కుంటున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘గోపాల గోపాల' సినిమాను నిలిపి వేయాలంటూ గతంలో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ పిటీషన్ కోర్టులో విచారణలో ఉంది. ఈ పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తూ... పిటిషన్‌ను వెనక్కి తీసుకొని మరో పిటిషన్ దాఖలు చేయాలని, దర్శక, నిర్మాతలనూ ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

వాస్తవానికి సినిమా విడుదలకు ముందు నుండే ఫిర్యాదులు, కేసుల హడావుడి మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా ఆగి పోతుందేమోనని అభిమానులు కంగారు పడ్డాయి. అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా ప్రదర్శితం అవుతూనే ఉంది. నిర్మాతలకు ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చి పెట్టింది. బాక్సాఫీసు వద్ద కూడా సినిమా బిజినెస్ క్లోజింగుకు వచ్చింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'Gopala Gopala' case details

తాజా పరిణామాల నేపథ్యంలో అభిమానుల్లో గతంతో పోలిస్తే కంగారు లేనే లేదు. అసలు ఈ సినిమాపై దాఖలవుతున్న కేసులను ఇపుడు అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వారికి కావాల్సింది సినిమా చూడటం. అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి వాళ్లలు ఎలాంటి టెన్షన్ లేదు.


మరో వైపు దర్శకులు, నిర్మాతలు కూడా ఈ కేసుల విషయమై పెద్దగా టెన్షన్ పడటం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ హిందీలో తెరకెక్కిన ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్. గతంలోనూ ‘ఓ మై గాడ్' చిత్రంపై కూడా ఇలాంటి కేసులు నడిచిన సంగతి తెలిసిందే. అందు వల్ల దర్శక నిర్మాతలు కూడా ఈ చిత్రంపై పలువురు వేస్తున్న పిటీషన్లను, గొడవలను లైట్ తీస్కుంటున్నట్లు తెలుస్తోంది.

English summary
Gopala Gopala is a 2015 Telugu satirical drama film directed by Kishore Kumar Pardasany. The film was jointly produced by Daggubati Suresh Babu and Sharat Marar under the banners Suresh Productions and North Star Entertainments Pvt. Ltd. respectively. It features Daggubati Venkatesh and Pawan Kalyan in the lead roles while Shriya Saran, Mithun Chakraborty and Posani Krishna Murali in key supporting roles. Anoop Rubens composed the music while Jayanan Vincent and Gautham Raju handled the cinematography and editing of the film respectively.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu