Just In
- just now
అల్లరి నరేష్ సినిమాకు భారీ డిమాండ్.. విడుదలకు ముందే అన్ని కోట్లు వచ్చాయా..?
- 9 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 1 hr ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ ప్లాపు సినిమాలో ‘గోపాల గోపాల’ పోలిక!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బాగానే రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ నటించిని సినిమా అంటే ‘ఓపెనింగ్స్' అదిరిపోతాయని...రికార్డులు బద్దలు కొడతాయని అంతా భావిస్తారు. ఓపెనింగ్స్ అదిరాయి కానీ రికార్డుల మోత లేదని తెలుస్తోంది.
మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే....గతేడాది విడుదలై ‘ప్లాపు' సినిమాల లిస్టులో చేరిన మహేష్ బాబు మూవీ ‘ఆగడు' సాధించినన్ని ఓపెనింగ్స్ కూడా ‘గోపాల గోపాల' సాధించలేదని కొందరు ప్రచారం. ఆగడు ఓపెనింగ్ డే కలెక్షన్ రూ. 9.74 కోట్లుగా ఉంటే, గోపాల గోపాల కేవలం 9.19 కోట్లు మాత్రమేనట. అయితే ఈ ప్రచారం వెనక నిజానిజాలు తేలాల్సి ఉంది. మరో వైపు ఓవర్సీస్ మార్కెట్లో మేజర్ మార్కెట్ అయిన యూఎస్‌లో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేక పోవడం గమనార్హం.

అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈచిత్రం బాగా ఆడుతోంది. చెన్నై బాక్సాఫీసు వద్ద కూడా దుమ్ము రేపుతోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.