For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గోపీచంద్ ‘జిల్’ పూర్తయింది...విడుదల ఎప్పుడంటే?

  By Bojja Kumar
  |

  మిర్చి,ర‌న్ రాజా ర‌న్, లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్స‌స్‌లు అందించిన క్రేజి నిర్మాణ సంస్ధ యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొక్ష‌న్ నెం-3 గా ప్రారంభమైన చిత్రం ‘జిల్‌'. ‘లౌక్యం' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత యాక్ష‌న్ స్టార్ గోపిచంద్ హీరోగా, ' ఉహ‌లు గుస‌గుస‌లాడే' లాంటి సూప‌ర్ హిట్ త‌రువాత రాశి ఖ‌న్నాలు జోడిగా న‌టిస్తున్నారు. క్రియోటివ్ ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌గ్గ‌ర దర్శ‌కత్వ శాఖ‌లో ప‌నిచేసిన రాధా కృష్ణ కుమార్ ని దర్శకునిగా ప‌రిచయం చేస్తూ... నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం మూడు పాట‌లు మిన‌హా షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుంది. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ‘జిల్' చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మార్చిలో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

  ఈ సంధ‌ర్బంగా నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్ లు మాట్లాడుతూ.. "యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా' మిర్చి' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంతో మా సంస్థ యు.వి.క్రియోష‌న్స్ ప్రారంభ‌మైంది, మా రెండ‌వ ప్ర‌య‌త్నం శ‌ర్వానంద్ హీరోగా'ర‌న్ రాజా ర‌న్'తో మ‌రోక బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించాం. ఇప్పుడు మా మూడ‌వ చిత్రం' లౌక్యం' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం త‌రువాత గోపిచంద్ హీరోగా, రాశిఖ‌న్నా హీరోయిన్ గా, రాధా కృష్ణ కుమార్ ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం జిల్‌. ఈ చిత్రానికి సంభందించి మూడు పాట‌లు మిన‌హ షూటింగ్ మెత్తం పూర్త‌యింది. ఈ పాట‌ల్ని ఫిబ్ర‌వ‌రి మెద‌టివారంలో విదేశాల్లో చిత్రీక‌రిస్తాము. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు. గోపిచంద్ గత చిత్రాల్లో లాగా యాక్ష‌న్ వుంటూ చ‌క్క‌టి ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంటర్ టైన‌ర్ గా గోపిచంద్ అభిమానుల్ని అల‌రిస్తుంది. అలాగే మా యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ వాల్యూని రెండింత‌లు చేసే చిత్రం గా జిల్ వుండ‌బోతుంది. గోపిచంద్ లుక్ ప‌రంగా ప‌క్కా కేర్ తీసుకున్నాము. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ ఫోస్ట‌ర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా టైటిల్ జిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రానికి త‌మిళం లో 'ఐ', హింది లో 'కిక్' చిత్రాల‌ని యాక్ష‌న్ అందించిన అణ‌ల్ అరుసు యాక్ష‌న్ కోరియోగ్ర‌ఫి చేయ్యగా గోపిచంద్ సూప‌ర్బ్ గా చేశాడు. రేపు ధియోట‌ర్స్ లో చూసిన ప్ర‌తిప్రేక్ష‌కుడు థ్రిల్ ఫీల‌వుతాడు. మా బ్యాన‌ర్ లో ర‌న్ రాజా ర‌న్ కి సూప‌ర్బ్ మ్యూజిక్ ని అందిచిన జిబ్రాన్ ఈ చిత్రానికి ఎక్స‌లెంట్ సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియో ని త్వ‌ర‌లో విడుద‌ల చేసి చిత్రాన్ని మార్చి లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహలు చేస్తున్నాము" అని అన్నారు.

  Gopichand Jill movie Completed

  ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ 'మిర్చి', 'ర‌న్ రాజా ర‌న్' లాంటి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ చిత్రాల్ని అందిచిన నిర్మాణ సంస్ధ యు.వి.క్రియోష‌న్స్ లో నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్ లు హ్య‌ట్రిక్ ఫిల్మ్ గా నాకు అవ‌కాశం ఇచ్చినందుకు నా స్పెష‌ల్ థ్యాంక్స్‌. ఈ చిత్రం లో గోపిచంద్‌, రాశిఖ‌న్నాలు జంట‌గా న‌టిస్తున్నారు. క‌థ గా ఏమి రాసుకున్నామో అలాగే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చేశాము. దీనికి నిర్మాత‌లు వంశి, ప్రమెద్ లు అందించిన స‌పోర్ట్ మ‌రచిపోలేనిది. గోపిచంద్ గారు ఈ చిత్రం లో కొత్త‌గా క‌నిపిస్తారు. ముఖ్యంగా యాక్ష‌న్ వైవిధ్యంగా వుంటుంది. జిబ్రాన్ సంగీతం ఒన్ ఆఫ్ ది హైలెట్ గా నిలుస్తుంది. వ‌చ్చే వారంలో షూట్ చేస్తే పాట‌ల‌తో టోట‌ల్ చిత్రం పూర్త‌వుతుంది. స‌మ్మర్ కానుక‌గా మార్చిలో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.. అని అన్నారు.

  నటీనటులు- గోపిచంద్, రాశిఖ‌న్నా, చ‌ల‌ప‌తిరావు, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి,సంప‌త్‌, క‌బీర్, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, అమిత్ ,ప్ర‌భాస్ శీను, ఫ‌నికాంత్‌, మాస్ట‌ర్ నిఖిల్‌, బేబి అంజ‌లి, క‌ల్ప‌ల‌త‌, మౌళిక మెద‌ల‌గువారు న‌టించారు.

  కాస్ట్యూమ్ డిజైన‌ర్ - తోట విజ‌య్ భాస్క‌ర్‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ - ఏ.య‌స్.ప్ర‌కాష్‌, యాఓన్ డైర‌క్ట్ - అన‌ల్ అరుసు, ఎడిట‌ర్‌- కోట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్రఫి- శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్‌, పి.ఆర్వో- ఎస్.కె.ఎన్‌, ఏలూరు శీను, సంగీతం- జిబ్రాన్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- సందీప్‌, నిర్మాత‌లు- వంశి, ప్ర‌మోద్‌, క‌థ‌-స్ర్కీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం - రాధా కృష్ణ కుమార్‌.

  English summary
  Gopichand Jill movie Completed. After a successful film like 'Loukyam', Gopichand is acting in the movie, 'Jil'. Radha Krishna Kumar is making his debut as the director with this movie. Raashi Khanna is the leading lady.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X