»   » తాళి కట్టిన ప్రతి వాడూ మొగుడు కాడంట..కాన్సెప్ట్ బాగుందా?

తాళి కట్టిన ప్రతి వాడూ మొగుడు కాడంట..కాన్సెప్ట్ బాగుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణవంశీ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడుగా రూపొందుతున్న 'మొగుడు' సినిమా షూటింగు హైదరాబాదులో కొనసాగుతోంది. ఇంతవరకు జరిగిన షూటింగుతో 70 శాతం పూర్తయిందని చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలిపారు. 'మగ పుట్టుక పుట్టిన ప్రతి వాడూ మగాడు కాదు. అలాగే తాళి కట్టిన ప్రతి వాడూ మొగుడు కాడు. భార్య మనసెరిగిన వాడు, బాధ్యత గలవాడు మాత్రమే మొగుడవుతాడన్న పాయింట్ తో ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాత చెబుతున్నారు.

తాప్సీ, శ్రద్దాదాస్ కథానాయికలుగా నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్, రోజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కటుంబ కథలను జనరంజకంగా మలచడంలో నిష్ణాతుడైన కృష్ణవంశీ ఈ చిత్రాన్ని చక్కగా రూపొందిస్తున్నారని నిర్మాత అంటున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

English summary
After 'Wanted' film Gopichand acting under Krishna Vamsi direction, movie titled as 'Mogudu'. 70% of shooting completed 'Mogudu' movie. Producer Nallamalupu Bujji planning to release 'Mogudu' film in September 2011. Taapsee and Shraddha Das are pairing with Gopichand in 'Mogudu' movie. Rajendra Prasad, Roja and Naresh are doing other key roles. Debutante music director Babu Shankar composing music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu