For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘క్రాక్’ నిర్మాతపై గోపీచంద్ మలినేని ఫిర్యాదు: సినిమా హిట్ అయినా కష్టాలు తప్పడం లేదుగా!

  |

  'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్ల తర్వాత మాస్ మహారాజా రవితేజ - యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'క్రాక్'. ఎన్నో ఆటంకాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇప్పటికీ హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో చిత్ర దర్శకుడు గోపీచంద్.. నిర్మాత ఠాగూర్ మధుపై ఫిర్యాదు చేశాడు. సినిమా హిట్ అయినా ఈ వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ వాళ్ల మధ్య ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  ఆదిలోనే ఎదురుదెబ్బ.. జాతర మొదలైంది

  ఆదిలోనే ఎదురుదెబ్బ.. జాతర మొదలైంది

  సంక్రాంతి కానుకగా జనవరి 9న అంటే ఈరోజు ‘క్రాక్' విడుదల కావాల్సి ఉండగా.. నిర్మాతకు ఎగ్జిబిటర్లకు మధ్య ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో వివాదాలు చెలరేగాయి. దీంతో సినిమా విడుదలను ఆపేశారు. ఆ తర్వాత చర్చలు ఫలించడంతో 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మొదటి ఆట నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా జాతర మొదలైంది.

  అన్నీ రంగాల్లో హైలైట్.. అందుకే అలా టాక్

  అన్నీ రంగాల్లో హైలైట్.. అందుకే అలా టాక్

  సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘క్రాక్' మూవీని పలువురు అత్యుత్తమ ప్రదర్శనతో నిలబెట్టారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇందులో మాస్ మహారాజా యాక్టింగ్.. గోపీచంద్ మలినేని టేకింగ్.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అలాగే, సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగెటివ్ యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి.

  కలెక్షన్ల సునామీ.. ఎన్ని వచ్చినా అడ్డేలేదు

  కలెక్షన్ల సునామీ.. ఎన్ని వచ్చినా అడ్డేలేదు

  రవితేజ నటించిన ‘క్రాక్' సినిమా మొదటి రోజు నుంచే అద్భుతమైన రీతిలో కలెక్షన్లను రాబడుతోంది. ఓపెనింగ్ డే అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 6.54 కోట్లను కలెక్ట్ చేసిన ఈ మూవీ.. నిన్నటి వరకూ అదే జోరును కనబరిచింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకుంది. ఇక, మొత్తంగా రూ. 30 కోట్లకు పైగా షేర్.. రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది.

  అక్కడా హవా చేపిస్తోన్న రవితేజ సినిమా

  అక్కడా హవా చేపిస్తోన్న రవితేజ సినిమా

  ‘క్రాక్' డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా'. ఒప్పందం ప్రకారం.. ఈ సినిమాను జనవరి 29నే స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. కానీ, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకున్న నిర్మాత.. దాన్ని వాయిదా వేయాలని సంస్థను కోరాడు. దీంతో ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. ఇక, మొదటి రోజే భారీ స్పందనను అందుకున్నట్లు తెలుస్తోంది.

  ‘క్రాక్’ నిర్మాతపై గోపీచంద్ మలినేని ఫిర్యాదు

  ‘క్రాక్’ నిర్మాతపై గోపీచంద్ మలినేని ఫిర్యాదు

  ‘క్రాక్' సూపర్ డూపర్ హిట్ అవడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో అటు రవితేజ ఇప్పటికే మరో సినిమా షూట్‌లో పాల్గొంటుండగా.. దర్శక నిర్మాతలూ కొత్త ప్రాజెక్టుల కోసం పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు గోపీచంద్ మలినేని.. నిర్మాత ఠాగూర్ మధుపై ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. టాలీవుడ్‌లో ఇప్పుడిది హైలైట్ అయింది.

  ఫిర్యాదు చేయడానికి కారణం ఏమిటంటే?

  ఫిర్యాదు చేయడానికి కారణం ఏమిటంటే?

  ‘క్రాక్' సినిమాకు సంబంధించి.. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ విషయంలో మిగిలిన మొత్తం ఇవ్వడానికి ఠాగూర్ మధు నిరాకరించాడని ఆరోపిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ సంఘాలు విచారణను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

  English summary
  The cast of Ravi Teja's next project under Gopichand Malineni's direction is getting bigger and bigger with every passing day. The makers have already roped in noted Tamil actor, Samuthirakami and Shruti Hassan for this project. The latest addition to the list is Varalaxmi Sarathkumar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X