»   » గోపిచంద్‌కు మళ్లీ కష్టాలు.. ఆక్సిజన్ ఆగిపోవడానికి కారణం అదేనట..

గోపిచంద్‌కు మళ్లీ కష్టాలు.. ఆక్సిజన్ ఆగిపోవడానికి కారణం అదేనట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో గోపిచంద్‌కు, నిర్మాత ఏఎం రత్నానికి కాలం కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. చాలా కాలం తర్వాత గోపిచంద్‌తో ఏఎం రత్నం నిర్మించిన ఆక్సిజన్ చిత్రం విడుదలకు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఆక్సిజన్ చిత్రం వరుస వాయిదాలు పడుతున్నది. కనీసం నవంబర్ మూడో వారంలోనైనా రిలీజ్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతున్నది.

ఆక్సిజన్‌కు ఆర్థిక ఇబ్బందులు

ఆక్సిజన్‌కు ఆర్థిక ఇబ్బందులు

ఆక్సిజన్ చిత్రాన్ని తన కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించారు. అయితే ఈ చిత్రం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టు సినీవర్గాలు చెప్పుకొంటున్నాయి.

అక్టోబర్‌లో రిలీజ్‌పై ప్రకటన

అక్టోబర్‌లో రిలీజ్‌పై ప్రకటన

అక్టోబర్ నెలలోనే ఆక్సిజన్ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత ఏఎం రత్నం భావించాడు. ఆ సమయంలోనే నటీనటులతో ప్రమోషన్ కూడా చేయించారు. అయితే ఆ చిత్రం రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది.

వాయిదాలపై వాయిదాలు

వాయిదాలపై వాయిదాలు

ఆక్సిజన్ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఈ చిత్రాన్నిఅక్టోబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత నవంబర్ 10కి వాయిదా వేశారు. మళ్లీ నవంబర్ 17వ తేదీకి రిలీజ్ డేట్‌ను మార్చారు.

గోపిచంద్‌కు రిలీజ్ సమస్యలు

గోపిచంద్‌కు రిలీజ్ సమస్యలు

ఇటీవల కాలంలో హీరో గోపిచంద్ చిత్రాలు రిలీజ్ విషయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోపిచంద్ నటించిన తాజా చిత్రం గౌతమ్ నందా మంచి వసూళ్లను సాధించింది. ఆక్సిజన్‌తో మరో హిట్ కొట్టాలన్న గోపిచంద్ ఈ చిత్రంతో కొంత నిరాశే కనిపిస్తున్నది. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అను ఇమ్మాన్యుయేల్, రాశీఖాన్నా నటించారు.

ఆక్సిజన్ ఎప్పుడెప్పుడా అని..

ఆక్సిజన్ ఎప్పుడెప్పుడా అని..

ఆక్సిజన్ చిత్రం విభిన్నమైన కథతో రూపొందిందనే ప్రచారం జరిగింది. ఈ చిత్రలో జగపతిబాబు, చంద్రమోహన్ కీలక పాత్రలను పోషించారు. అయితే ఆక్సిజన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అంశంపై అటు సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ నెలకొన్నది.

English summary
Gopichand's Oxygen supposed to hit the theatres October 27th. Reports suggest that film is experiencing some financial issues. Unexpectedly, the film is getting delayed constantly and there is absolutely no update on the release of the film now. Anu Emmanuel, Raashi Khanna, Jagapathi Babu and Chandra Mohan are the lead leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu