»   » పవన్ సినిమాలో విలన్‌గా హీరో, డిసప్పాయింట్‌లో మన మాస్‌హీరో ఫ్యాన్స్

పవన్ సినిమాలో విలన్‌గా హీరో, డిసప్పాయింట్‌లో మన మాస్‌హీరో ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్ తొలివలపు అనే సినిమా తో హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టినా సరైన బ్రేక్ లేక అవకాశాలు రాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకొని విలన్ గా వచ్చి నటన లో తానేమిటో నిరూపించుకున్నాడు ఈ మాస్ హీరో. తేజా సినిమా నిజం, జయం లలో గోపీచంద్ చేసిన విలన్ పాత్రలకి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఇక వర్షం లో చేసిన పాత్ర తో హీరో తో సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్.

ఆ పాపులారిటీ తో యగ్నం లాంటి ఒక మామూలు కథ తో హీరోగా మళ్ళీ అడుగు పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ వరుసగా రెండు ఫ్లాపులు అయినా లక్ష్యం తో మళ్ళీ ఇంకో హిట్ కొట్టాడు. అయితే మొదటినుంచీ గోపీచంద్ కెరీర్ ఒడిదుడుకులతోనే సాగుతోంది. పక్కాగా ఇంతవరకూ నిలబడ లేకపోయాడు. పెర్ఫార్మెన్స్ లో ఏ తేడాలేకపోయినా కథలను ఎంచుకోవటమే గోపీచంద్ మైనస్ అంటారు సినీ విశ్లేషకులు.

 ఆర‌డుగుల బుల్లెట్

ఆర‌డుగుల బుల్లెట్

ఇలా ఇంకా ఫ్లాపుల్లోనే ఉన్న గోపీచంద్ ఈ మధ్య ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది ఇదేం నిరాధారమైన మాటేం కాదు. గోపీచంద్ రాబోయే సినిమాకి టైటిల్ గా ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది'లో పాట ‘ఆర‌డుగుల బుల్లెట్' ను ప‌రిశీలించారు.

గౌతమ్ నందా

గౌతమ్ నందా

ఇప్పుడీ టైటిల్‌ను హోల్డ్‌లో పెట్టి ‘గౌతమ్ నందా' అనే కొత్త టైటిల్ ను ప‌రిశీలిస్తున్నట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఈ పేరుకు ప‌వ‌న్ కు చాలా ద‌గ్గర సంబంధం ఉంది. ఇది కూడా ‘అత్తారింటికి దారేది'లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోషించిన రోల్ నేమ్. దీంతో ప‌వ‌న్‌ను గోపీచంద్ భారీగానే టార్గెట్ చేసిన‌ట్లున్నాడ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో గుస‌గ‌సలు మొద‌ల‌య్యాయి. ఇదే కాస్త ఇంట్రస్టింగ్ అంటే ఇప్పుడు రాబోయే షాక్ ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది.

షాకింగ్ న్యూస్

షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ నటించబోతున్న ఓ సినిమా లో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం దీనికి సంబంధించిన వివరాలను ఇలా ఉన్నాయి. త్వరలో ఓ మల్టీస్టారర్ కాంబినేషన్ తెరపైకి రానుంది. త్వరలో పవన్ కళ్యాణ్-గోపిచంద్ కాంబినేషన్ లో ఓ మూవీ రానుందని అంటున్నారు. ఈ మూవీలో వీరిద్దరూ కలిసి నటించేందుకు ఓ డైరెక్టర్ ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ని పూర్తిచేస్తున్నారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ మూవీలో

పవన్ కళ్యాణ్ మూవీలో

అయితే పవన్ కళ్యాణ్ మూవీలో గోపిచంద్ పాత్ర విలన్ గా ఉంటుందని అంటున్నారు. గతంలో గోపిచంద్ విలన్ గా నటించిన చిత్రాలకి మంచి ఆధరణ వచ్చింది. ఇప్పుడు కూడ పవన్ కళ్యాణ్ మూవీలో గోపిచంద్ విలన్ గా నటించనుండటంతో ఈ మూవీపై మార్కెట్ లో అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సినిమా తర్వాత:

ఈ సినిమా తర్వాత:

అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందనే దానిపై స్పష్టత రాలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే బయట పెట్టేలా ఉన్నారు . విలన్ గా గోపీచంద్ పర్ఫార్మెన్స్ మనకు ఆల్రెడీ తెల్సిందే కాబట్టి మంచి కాంబో అనే అనుకోవచ్చు గానీ... ఈ సినిమా తర్వాత మళ్ళీ గోపీచంద్ హీరోగా తన కెరీర్ ని కొనసాగించగలడా అన్నదే ఆయన అభిమానులకి వచ్చే అనుమానం.

English summary
Some reports are making rounds in film circles that power star Pavan Kalyan and hero Gopichand will be doing a movie, Gopichand will be acting as a villain in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu