twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పండని 'గోరింటాకు' (స్మాల్ రివ్యూ)

    By Staff
    |

    Gorintaku
    'రక్త సంభందం', 'చిట్టి చెల్లెలు', 'పుట్టింటి పట్టుచీర', 'పుట్టింటికి రా చెల్లీ' వంటి అన్నా చెల్లెళ్ళ సెంటిమెంటు సినిమాలెన్నో తెలుగు తెరపై కెక్కి హిట్లు నమోదు చేసుకున్నాయి. తాజాగా అలాంటి అనుబంధాన్ని తెరకెక్కించిన మరో చిత్రమే గోరింటాకు. రాజశేఖర్, సుజిత, మీరాజాస్మిన్, ఆర్తీ అగర్వాల్, శివాజీ రాజా తదితరులు నటించిన ఈ కన్నడ రీమేక్ చిత్రాన్ని దర్శకుడు అంతగా పండించలేకపోయాడని ప్రేక్షకుల టాక్ . సాంకేతికంగా ఎంతో అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో కూడా అనుభంధాలు,ఆత్మీయతలకు చోటు ఉన్నా మరీ సీరియల్‌ను తలపించే తరహాలో సాగే సినిమాను చేయడం నిర్మాతల సాహసమేనని చెప్పాలి.

    కథ ప్రకారం ఈ తరహా అన్ని సినిమాల్లో లాగానే అన్నగారు తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చెల్లలను ఎంతో ప్రాణప్రదంగా చూసుకుంటూంటాడు. ఇక అన్న అనురాగాన్ని పొందే చెల్లెలి అదే రీతిలో ఇంకెంచెం మోతాదు ఎక్కువలో స్పందిస్తూంటుంది. ఇలా వీరిద్దరి మధ్య సాగిన రెండున్నర గంటల సన్నివేశాల సీరియలే 'గోరింటాకు'. సర్వారాయుడు(రాజశేఖర్), జానకి(సుజిత) ఆ ఊరి ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటుంటారు. ఇలా ఊరందరినీ బిడ్డలుగా భావించినవారికి సంతానలేమి సమస్య బాధిస్తుంది. ఓ శుభకార్యంలో జానకి గొడ్రాలుగా నిందించబడుతుంది.

    దాంతో ఊరి పూజారి వీరి జాతకం పరీక్షించి పిల్లలు కలగడానికి శాంతి జరిపించాలనీ, కానీ పిల్లలు పుడితే తల్లిదండ్రులు చనిపోతారని చెబుతాడు. వంశంకోసం ప్రాణత్యాగమైనా చేయడానికి సిద్ధపడతారు వారు. ఆ తర్వాత వారికి బాబు(రాజశేఖర్), లక్ష్మీ(మీరా జాస్మిన్) జన్మిస్తారు. అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను బాబాయ్ లాంటి ఆ ఇంటి పెద్ద దిక్కు చంద్రమోహన్ పెంచుతాడు.

    ఇక అక్కడ నుంచి అన్నాచెల్లెళ్ల అనుబంధం కనిపిస్తుంది. చెల్లెల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే... తన చెల్లెలు చెప్పిందని ఆపదలో ఆదుకున్న స్నేహితురాలు నందిని( ఆర్తీ అగర్వాల్)కి ఉద్యోగం ఇచ్చి జీవిత భాగస్వామి చేసుకుంటాడు. ఆ తర్వాత పక్క ఊరి కుర్రాడు ఆకాష్(ఆకాష్) తన చెల్లెలకు నచ్చాడని ఆ ఇంటి పనిమనిషిగా వెళ్లి వారి పరిస్థితి తెలుసుకుని చెల్లెల్ని ఆ ఇంటి కోడల్ని చేస్తాడు. ఇంతవరకూ కథ సాఫీగానే నడుస్తుంది. అకాస్మాత్తుగా సూర్యకాంతం(తమిళనటి) నందిని దూరుపు చుట్టంగా పరిచయం చేసుకుని ఇంట్లో తిష్ట వేస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నా చెల్లెళ్ల కుటుంబాలతో ఆమె ఎలా ఆడుకుంది... ఇత్యాది విషయాలను వెండితెరపై చూడాల్సిందే....

    చిత్రానికి వస్తే... ఫస్టాఫ్ సాఫీగా సాగినా క్లైమాక్స్‌లో తన చెల్లెలికి అన్యాయం జరిగిందని తెలుసుకున్న అన్న మన తెలుగు సినిమా లెక్క ప్రకారం పగ తీర్చుకోకుండా చనిపోవటం కథా లోపంగా అందరూ భావిస్తున్నారు. అన్నకోసం చెల్లిల్ని నందిని, సూర్యకాంతం మాటలతో హింసించడం, పిల్లలు ఆకలేసి అన్న తింటుంటే నోటి దగ్గర అన్నాన్ని లాగేయటం వంటివి ఎన్ని చూపించినా ఫీల్ కలిగించలేదు. చెల్లెలి పాత్రను చంపేయడం, అది చూసి అన్న గుండె ఆగిపోవడం కృతంగా అనిపిస్తాయి. అయినా టీవీ సీరియల్స్‌లో ఇంతకంటే ఎక్కువగా సెంటిమెంట్లు, లేడీ విలన్లును చూస్తున్న మహిళా ప్రేక్షకులకు 'గోరింటాకు' ఏమాత్రం ఆకట్టుకునే అవకాశం లేదని చూసిన వాళ్ళు ఇనాన్ మస్ గా తీర్పు చెపుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X