»   »  మణిరత్నం...'రావణ్'

మణిరత్నం...'రావణ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mani Ratnam
మణిరత్నం లేటస్ట్ గా భారీ స్ధాయిలో రూపొందించనున్న చిత్రం హిందీ వెర్షన్ టైటిల్ 'రావణ్' అని విశ్వశనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టైటిల్ కు తగ్గట్లే రామాయణాన్ని మోడరన్ డేస్ కి అనువర్తింప చేసి మణిరత్నం స్కిప్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా లో లీడ్ రోల్స్ ని (సీత,రాముడు) ఐశ్వర్య,అభిషేక్ బచ్చన్ చేస్తున్న విషయం తెలిసిందే .అలాగే కథలో కీలకమైన హనుమంతుడు పాత్ర కోసం బాలీవుడ్ కామిడీ హీరో గోవింద ని సంప్రదించారుట.సీనియర్ నటుడు ఆదిత్యా పాంచోలి ని రావణుడు పాత్ర లో తీసుకున్నాడుట. ఇక గతంలోనూ మణిరత్నం ఇటువంటి ప్రయోగం 'దళపతి' చిత్రంతో చేసి ఉన్నాడు. రజనీకాంత్ ,ముమ్మట్టి,అరవింద్ స్వామి,శోభన ప్రధాన పాత్రలుగా మహాభారంతాన్ని ఎడాప్ట్ చేసి అప్పట్లో హిట్ కొట్టాడు. కాబట్టి ఈ మోడరన్ రామాయణం కూడా విజయం సాధిస్తుందని ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.మన తెలుగులోనూ బాపు రమణలు 'ముత్యాలు ముగ్గు' వంటి అనేక సినిమాల్లో రామాయణాన్ని ఆధునిక కాలానికి అనువర్తింపచేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X