twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెల్లవారు ఝామున ‘గోవిందుడు అందరి వాడేలే’(న్యూ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కృష్ణ వంశీ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అక్టోబర్ 1న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలీజ్ డే పోస్టర్లు విడుదల చేస్తారు. అక్టోబర్ 1న తెల్లవారు ఝామున 5 గంటల 18 నిమిషాల ఆటతో సినిమా విడుదల చేస్తున్నట్లు పోస్టర్లలో పేర్కొన్నారు.

    దసరాకు విడుదలవుతున్న పెద్ద సినిమా కావడంతో అందరి దృష్టి సినిమాపైనే ఉంది. కత విషయానికొస్తే...ఫారిన్‌ నుంచి వచ్చిన అభిరామ్‌ (రామ్‌చరణ్‌) ఓ కుటుంబంలోని సమస్యలను పరిష్కరించి, ఎలా అందరివాడయ్యాడనేది ఇందులోని ప్రధానాంశం. ఇందులో శ్రీకాంత్ చరణ్‌ బాబాయ్‌గా నటించారు. అయితే సినిమాలో శ్రీకాంత్ పెళ్లవదు. చరణ్‌ తండ్రి (రెహమాన్‌)కూ, శ్రీకాంత్ పాత్రకు కథ ప్రకారం చాలా వయసు తేడా ఉంటుంది. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీని అభిరామ్‌ ఎలా కలుపుతాడనేది కూడా ఓ పాయింట్‌. అలాగే శ్రీకాంత్, ఆయన తండ్రి పాత్ర పోషించిన ప్రకాశ్‌రాజ్‌ను అభిరామ్‌ ఎలా కలిపాడనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    రామ్ చరణ్-కాలజ్ రొమాన్స్

    రామ్ చరణ్-కాలజ్ రొమాన్స్


    ఈ సినిమాలో రామ్ చరణ్-కాజల్ మధ్య జరిగే రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండనుంది.

    తన పాత్ర గురించి శ్రీకాంత్

    తన పాత్ర గురించి శ్రీకాంత్


    తన పాత్ర గురించి శ్రీకాంత్ వెల్లడిస్తూ....ఫారిన్‌లో ఉండి రావడం వల్ల సినిమాలో నేనెవరో అతని(రామ్ చరణ్ ) తెలుసు కానీ, అతనెవరో నాకు తెలీదు. నేనతన్ని కొట్టినా, అతను నన్ను కొట్టడు. సెకండాఫ్‌లో అతనెవరనేది నాకు తెలుస్తుంది. నా పాత్ర పేరు బంగారి. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే పాత్ర. ఎనర్జీ లెవల్స్‌ హైలో ఉంటాయి. తండ్రిని ఇరిటేట్‌ చేసే పనులు చేస్తుంటాడు. ఇంట్లో ఉండకుండా వేరే చోట ఉండే పాత్ర అన్నారు.

    దర్శకుడు...

    దర్శకుడు...


    దర్శకుడు మాట్లాడుతూ... ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్‌ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. '' అన్నారు.

    ఇతర వివరాలు...

    ఇతర వివరాలు...


    శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ. కూర్పు: నవీన్‌ నూలి.

    English summary
    Govindudu Andarivadele release day Photos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X