»   » మహేష్-నమ్రత 5 ఏళ్ల డేటింగ్ రహస్యం తెలిసిపోయింది!

మహేష్-నమ్రత 5 ఏళ్ల డేటింగ్ రహస్యం తెలిసిపోయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, నమ్రతలు ఇటీవల(ఫిబ్రవరి 10)న 11వ పెళ్లి రోజుకు జరుపుకున్నారు. తమ పెళ్లి రోజు సందర్భంగా నమ్రత సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. పెళ్లి గురించి ఆమె కొత్తగా చెప్పారు. బహుషా పెళ్లిపై ఆమె చెప్పినట్లు ఇప్పటి వరకు ఏ సినీ స్టార్ మాట్లాడి ఉండరు.

‘గ్రేట్ మ్యారేజెస్ అదృష్టం వల్లనో లేదా అనుకోకుండానో జరగవు. కొంత సమయం తీసుకుని ఆలోచించడం, దయా గుణం, అనుబంధం, పరస్పర గౌరవం, భార్యా భర్తల మధ్య చెదిరిపోని కమిట్మెంట్ ని పెట్టుబడిగా పెట్టడం వల్ల వచ్చే ఫలితమే.. గ్రేట్ మ్యారేజ్' అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.

మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నమ్రత మాటలను బట్టి వీరు ఐదేళ్ల సమయం అందుకే తీసుకున్నారన్నమాట. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. తొమ్మిదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు మహేష్, నమ్రత. ఆగస్టు 31, 2006న కుమారుడు గౌతంకృష్ణ జన్మించగా, జులై 20, 2012న కూతురు సితార జన్మించింది.

పెద్దలను ఎదురించి చేసుకున్న ప్రేమ వివాహం కావడంతో మహేష్ బాబు, నమ్రత వివాహం ముంబైలో నిరాడంబరంగా జరిగింది. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ‘వంశీ' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన స్నహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లికి ముందు దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసారు.

English summary
"Great marriages don't happen by luck or by accident. They're the result of a consistent investment of time, thoughtfulness, forgiveness, affection, mutual respect and rock-solid commitment between a husband and wife." Namrata Shirodkar said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu