»   »  ‘బాహుబలి’ మరో ప్రతిష్టాత్మక గౌరవం (ఫోటో)

‘బాహుబలి’ మరో ప్రతిష్టాత్మక గౌరవం (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు.... ఇండియన్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ ‘ది ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ గైడ్‌' నుండి ప్రశంసలు అందాయి. ఈ మేరకు అధ్యక్షుడు మహేశ్‌ భట్‌ చిత్ర బృందాన్ని అభినందిస్తూ మంగళవారం ఓ ప్రశంసాపత్రాన్ని జారీచేశారు.

బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచిందని పేర్కొన్నారు. భారీ ప్రమాణాలతో భారతీయ సినిమా విలువల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ప్రశంసా పత్రం ఫోటోను బాహుబలి టీం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

Guild recognizing Baahubali

గూగుల్ లోనూ బాహుబలి...
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో విడుదలైన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించింది. గూగుల్‌ సెర్చ్ లో కూడా ఇండియాలో నెం.1 మూవీగా బాహుబలి ప్రథమ స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
‘Thank you so much Guild Film Awards for recognizing 'Baahubali : The Beginning' at the show last night!’ Baahubali team said.
Please Wait while comments are loading...