»   » 'ఆరెంజ్', 'శక్తి' టైటిల్స్ ను కూడా దెబ్బ తీయచ్చా?

'ఆరెంజ్', 'శక్తి' టైటిల్స్ ను కూడా దెబ్బ తీయచ్చా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆరెంజ్', 'శక్తి'కి ముందు ఎవరైనా హీరో పేర్లను తగిలించుకుని వాడుకోవచ్చా? అంటూ ప్రశ్నించారు గుణశేఖర్. కత్తి టైటిల్ విషయమై గత కొద్ది రోజులుగా కళ్యాణ్ రామ్ కీ గుణశేఖర్ కీ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్ళినా న్యాయం జరగలేదనే ఆవేదనతో ఉన్న గుణశేఖర్ ఆ టైటిల్ ని వదిలేస్తున్నానని ప్రకటిస్తూ ఇలా మాట్లాడారు. అలాగే ఈ పని చేసింది ఎందరికో ఆదర్శ ప్రాయుడు నాకు ఎంతో ఇష్టం అయిన ఎన్టీఆర్ వారసులు కావటం భాధాకరం. ఎన్టీఆర్ మీద ఉన్న ఇష్టం తోనే ఆయన మనవడు జూ ఎన్టీఆర్ ని రామాయణం చిత్రంతో సినిమా తెరకు పరిచయం చేసా. ఎవరో చేసారని వీరు కూడా ఇలా చేయటం ఎంత వరకూ సబబు అని ఆవేదనతో అన్నారు. అయినా నాకు భావ దారిద్రం లేదు కాబట్టి మరో టైటిల్ నా చిత్రానికి పెట్టుకోగలను. అంతెందుకు గతంలో నేను 'ఒక్కడు' తీసినప్పుడు ముందు 'కబడ్డీ' అనుకున్నాం. కుదరలేదు. 'అతడే ఆమె సైన్యం' అనుకున్నాం. అదీ రిజిస్టర్ అయి ఉంది. అంత మాత్రాన వాటిని నేను వాడుకోలేదే. ఇక మహేష్ తో 'అర్జున్' చేసేటప్పుడు ఆ టైటిల్‌ను తన కుమారుడు కోసం అట్టే పెట్టుకున్నా అడగ్గానే అల్లు అరవింద్ నాకు ఇచ్చారు'. అలాగే నేను నాగార్జునతో క్రాంతి కుమార్ గారు సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర ఉన్న సిద్దార్ద టైటిల్ ఇచ్చాను అన్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu