»   »  గుణశేఖర్ ఆ టైటిల్ రిజిస్టర్ చేయించాడేంటి?, ఏ హీరోతో చేద్దామని, భారీ సబ్జెక్టు కదా

గుణశేఖర్ ఆ టైటిల్ రిజిస్టర్ చేయించాడేంటి?, ఏ హీరోతో చేద్దామని, భారీ సబ్జెక్టు కదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో 'రుద్రమదేవి' టైటిల్ తో సినిమా రూపొందించి తన సత్తాను మరోమారు చాటుకున్న గుణశేఖర్, ఈ సినిమా సీక్వెల్ గా 'ప్రతాపరుద్రుడు' చేయనున్నట్టు అప్పట్లో చెప్పారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా ఉంటుందని ఆయన అనడంతో, అంతా ఆ సమయం కోసం ఎదురుచూస్తూంటే ఆయన ఇంకో సినిమా ని వెలుగులోకి వచ్చారు.

అయితే, ఈ 'ప్రతాపరుద్రుడు' సినిమా విషయం ఏమైందో తెలియదు గానీ, తాజాగా ఆయన 'హిరణ్యకశిపుడు' టైటల్ ను రిజిష్టర్ చేయించారు. ప్రహ్లాదుడు .. హిరణ్యకశిపుడు .. నరసింహస్వామికి సంబంధించిన కథ చాలామందికి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఆయన రాక్షస రాజైన 'హిరణ్యకశిపుడు' పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన తెలియజేసే అవకాశం వుంది.

Gunasekhar's next grand movie: Hiranyakashipa

గుణశేఖర్ తన 'గుణ టీమ్ వర్క్స్' బేనర్ మీద 'హిరణ్య కశ్యప' అనే టైటిల్ రిజిస్టర్ చేయించడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ పేరుతో ఓ తమిళ నటుడిగా హీరోగా పెట్టి మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ తీయాలని గుణశేఖర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి హిరణ్య కశ్యపుడు అనగానే ఆటోమేటిగ్గా 'భక్త ప్రహ్లాద' సినిమా గుర్తుకొస్తుంది. అందులో ఎస్వీఆర్ పోషించింది హిరణ్య కశ్యపుడి పాత్రే. మరి క్లాసిక్‌గా నిలిచిపోయిన 'భక్తప్రహ్లాద'కు కొత్త వెర్షన్ తీయడానికి గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా హిరణ్య కశ్యపుడి కోణంలోనే సాగుతుందని తెలుస్తోంది. హాలీవుడ్ లో పాత క్లాసిక్స్ ని మరోసారి రీమేక్ చేస్తున్న ట్రెండ్ నడుస్తోంది. దాంతో తెలుగులో కూడా అలాంటి ప్రయత్నమే చేయాలని గుణశేఖర్ భావిస్తున్నారట.

English summary
'Hiranyakashipa - The Story of Bhakta Prahlad' title was registered recently at Film Chamber of Commerce on his Gunaa Team Works banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu