»   »  ‘రుద్రమదేవి’కోసం భారీ సెట్...డిటేల్స్

‘రుద్రమదేవి’కోసం భారీ సెట్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గుణశేఖర్ అంటేనే భారీ సెట్స్ అని చెప్తూంటారు. ఆయన ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో గుణా టీమ్ వర్క్ పతాకంపై భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా 'రుద్రమదేవి'ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన అన్నపూర్ణ సెవర్ ఏకర్స్ లో 'అంతఃపురం' సెట్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసి అందులో 'అంతఃపురం లో అందాల చిలుక' అనే పాటను చిత్రీకరిస్తున్నారు. అనుష్క తో పాటు జరాఖాన్, నటాలియా కౌర్ ఈ పాటలో కనపడనున్నారు.

హీరో శ్రీకాంత్ పిల్లలు రోషన్, 14 ఏళ్ల ప్రాయంలో ఉన్న చాళుక్య వీరభద్రుడి పాత్రలో చిన్నప్పటి రాణాగా నటిస్తున్నారని, అలాగే కూతురు మేథ తొమ్మిదేళ్ల ప్రాయంలో వున్న రుద్రమదేవిగా నటిస్తున్నారని, ప్రస్తుతం వీరిద్దరికి గుర్రపు స్వారీ, కత్తియుద్ధాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
After a number of lavish and intricate sets, Gunasekhar has now readied an ‘anthahpura mandiram’ set at Annapurna 7 Acres complex. The song ‘Anthahpuram lo Andhala Chilaka’ is currently being shot on Anushka, Zara Shah and Nathalia Kaur in this set.Gunasekhar is the director and producer of this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu