»   » అదే కారణమా?.... గుణశేఖర్ ‘చిన్న’ చూపు!

అదే కారణమా?.... గుణశేఖర్ ‘చిన్న’ చూపు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రుద్రమదేవి అనే చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు గుణశేఖర్ ఈచిత్రం ద్వారా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వక పోయినా...గుణశేఖర్ మాత్రం పెట్టిన పెట్టుబడి రాబట్టకున్నారు.

రుద్రమదేవి' తర్వాత కాకతీయ వంశానికి చెందిన మరో చక్రవర్తి 'ప్రతాప రుద్రుడు' గురించి సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన కూడా మొదలెట్టారు. త్వరలో ప్రతాపరుద్రుడు సినిమాచేయబోతున్నట్లు ప్రకటించారు కూడా.

 Gunashekar is preparing script works to small film

ఇలాంటి పెద్ద సినిమా అయినపుడు స్టార్ హీరో అయితేనే వర్కౌట్ అవుతుందని భావించిన ఆయన టాలీవుడ్‌లోని ప్రముఖ హీరోలను సంప్రదించగా అందరూ తనకు ఇది సూటవ్వదనో, డేట్స్ లేవనో హ్యాండిచ్చారు. దీంతో తన కథకు తగిన స్టార్ హీరో దొరికిన తర్వాతే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్న గుణశేఖర్ ఈ గ్యాపులో 'చిన్న' సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సాధారణంగా గుణశేఖర్ సినిమాలంటేనే భారీ గా ఉంటాయి. తారాగణం దగ్గర నుండి సెట్టింగ్స్ వరకు భారీగా ఖర్చు ఉంటుంది. అలాంటి ఆయన చిన్న సినిమాల వైపు చూస్తున్నారంటే అందుకు కారణం ఫైనాన్సియల్ గా నిలదొక్కుకోవడానికే అని టాక్. ఓ యంగ్ హీరోతో రూ. 10 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ఉండబోతోందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ మొదలైనట్లు సమాచారం.

English summary
Gunashekar's Prathaparudrudu shooting would be delayed now. Meanwhile, Gunashekar have reportedly decided to film a small movie. Reports came in that Gunashekar is preparing script works to film a movie with a young hero with less than 10 crores of budget.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu