»   » గుండెజారి గల్లంతయ్యిందే చిత్ర దర్శకుడిపై దాడి

గుండెజారి గల్లంతయ్యిందే చిత్ర దర్శకుడిపై దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువ హీరో నితిన్‌తో 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం రూపొందించిన దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండాపై దాడి జరిగింది. కొండా భార్య ప్రసూన తల్లి ఆయనపై దాడి చేసినట్టు సమాచారం. తన కుమార్తె ప్రసూనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని విజయ్ కుమార్‌పై ప్రసూన తల్లి స్వరూపారాణి ఆరోపించింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది.

ప్రసూనను దర్శకుడు కొండా విజయ్ కుమార్ మార్చి 1 తేదీన ప్రేమ వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమించుకొంటున్న విజయ్‌ ‌, ప్రసూన పెద్దల ఎదురించి ప్రేళ్లి చేసుకొన్నారు. ఈ వివాహానికి విజయ్‌ కుటుంబంతో పాటు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Gunde Jaari Gallanthayyinde Director Vijay Kumar Konda Attacked By Mother In Law

దాడి నేపథ్యంలో ప్రసూన కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విజయ్‌కుమార్ కొండ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రసూన తల్లి దండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నది.

English summary
Gunde Jaari Gallanthayyinde Director Vijay Kumar Konda got married to long time girl friend. but vijayakumar attacked by brides mother. So he asked SR Nagar police to give protection.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu