»   »  గుంటూరు టాకీస్.... నుండి ఆ సీన్లు తొలగింపు!

గుంటూరు టాకీస్.... నుండి ఆ సీన్లు తొలగింపు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గుంటూర్‌ టాకీస్‌'. ఈ చిత్రం విడుదల తర్వాత ఓ వివాదానికి కారణమైంది. . అయితే ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో వికలాంగులను కించపరిచేలా ఓ సన్నివేశం ఉందని తెలంగాణ వికలాంగుల సంఘం సినిమాపై కేసు వేసిన సంగతి తెలిసిందే.

శృంగార సీన్లు, ఐటం సాంగ్స్: అప్పుడు మోస పోయానంటున్న రేష్మి

Guntur Talkies Movie In Trouble, scene to be deleted

తెలంగాణ వికలాంగుల సంఘం అధ్యక్షుడు వెంకన్న ఆధర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఈ విషయంపై గుంటూరు టాకీస్ దర్శక నిర్మాతలు స్పందిచడమే కాకుండా సినిమాలో క్యారెక్టర్ ను అనుసరించి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించామే తప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదని తెలిపారు.

నన్ను అలా వాడుకోకండయ్యా... అంటూ అనసూయ రిక్వెస్ట్

పై పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నుండి సినిమాలో తొలగిస్తున్నాం అని గుంటూరు టాకీస్ దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 4న గ్రాండ్ రిలీజ్ అయ్యింది.

English summary
Guntur Talkies Movie In Trouble. Telangana Disability Rights Group registered case against ‘Guntur Talkies’ in Osmania University Police Station under PWC Act 1995.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu