70 లక్షలు పెట్టి కారు కొనొచ్చు కానీ.. రూ. 100 పెట్రోల్ కొట్టించుకోలేవా? జ్వాలా గుత్తాపై ఆరెస్సెస్ నేత ఫైర్

బాడ్మింటన్ క్రీడాకారిణి, సినీ నటి గుత్తా జ్వాలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొద్ది సంవత్సరాలుగా తమిళ సినీ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్, ఆ తర్వాత పెళ్లి వార్తలతో నిత్యం మీడియా పతాక శీర్షికలను ఆకర్షించారు. తాజాగా దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై జ్వాలా గుత్తా స్పందించడంపై ఆర్ఎస్సెస్ నేత మండిపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే...

 తమిళ నటుడు విష్ణు విశాల్‌తో పెళ్లి

తమిళ నటుడు విష్ణు విశాల్‌తో పెళ్లి

తమిళ నటుడు, క్రికెటర్ విష్ణు విశాల్‌తో సుదీర్ఘంగా డేటింగ్ చేసిన తర్వాత కొద్ది నెలల క్రితం గుత్తా జ్వాలా పెళ్లి చేసుకొన్నది. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్‌కు ప్రయాణిస్తూ కాపురం చేస్తున్నది. గతంలో బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత విష్ణు విశాల్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే.

కొత్త కారు ముందు జ్వాలా గుత్తా ఫోజు

కొత్త కారు ముందు జ్వాలా గుత్తా ఫోజు

తాజాగా జ్వాలా గుత్తా ఖరీదైన, విలాసవంతమైన స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసింది. ఆ కారు ముందు నిలుచొని ఫోటోకు ఫోజిచ్చింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కారు విలువ సుమారు 50 నుంచి 70 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇలా కొత్త కారుతో కాపురాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు.

పెట్రోల్ ధరలపై గుత్తా జ్వాలా ట్వీట్

పెట్రోల్ ధరలపై గుత్తా జ్వాలా ట్వీట్

ఇదిలా ఉంటే.. దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయనే విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండంపై ప్రజలు ఆగ్రహంతోపాటు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో గుత్తా జ్వాలా పెట్రో ధరలపై స్పందిస్తూ.. పెట్రోల్ కేవలం రూ.105.55 మాత్రమే అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గుత్తా జ్వాలాను నిలదీసిన ఆరెస్సెస్ నేత

గుత్తా జ్వాలాను నిలదీసిన ఆరెస్సెస్ నేత

అయితే గుత్తా జ్వాలా ట్వీట్‌పై ఆరెస్సెస్ నేత, సామాజిక కార్యకర్త శీతల్ మన్సబ్దార్ చోప్రా ఘాటుగా స్పందించారు. పెట్రోల్ ధరలపై గుత్తా జ్వాలా చేసిన ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నీవు 50 నుంచి 70 లక్షల రూపాయల విలువైన కారును కొనే స్థోమత ఉంది. కానీ 105 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించుకోలేవా అంటూ ట్విట్టర్‌లో శీతల్ చోప్రా నిలదీసింది. దాంతో ఈ ట్వీట్ కూడా వైరల్ అయింది. పలువురు ఈమె ట్వీట్‌పై మిశ్రమంగా స్పందిస్తున్నారు.

ఆరెస్సెస్ నేతపై నెటిజన్ల గరం

ఆరెస్సెస్ నేతపై నెటిజన్ల గరం

అయితే శీతల్‌ ట్వీట్‌పై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. నెలకు 15 వేలు సంపాదించే మధ్య తరగతి, సేల్స్ మేన్స్ పరిస్థితి ఏమిటి? పెట్రోల్ రేట్ 105 రూపాయలు ఉంటే బతికేది ఎట్టా? అంటూ ఒకరు.. అందరూ ఒకటే కాదు.. పెట్రోల్ రేట్ 105 ఉండటాన్ని మీరు సమర్ధించుకొంటున్నారా? రైతులు, మధ్యతరగతి వాళ్లు ఈ రేటును భరించగలరా? కరోనా సమయంలో ధరల పెంపు విషయంలో ప్రభుత్వ విధానాన్ని మీరు, ఆరెస్సెస్ ప్రశ్నించగలరా? అని నిలదీస్తున్నారు.

Recommended Video

Jwala Gutta Dates Tamil Actor, Gets Intimate
జ్వాలా గుత్తా కెరీర్‌ గురించి..

జ్వాలా గుత్తా కెరీర్‌ గురించి..

గుత్తా జ్వాలా లైఫ్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 22వ తేదీన విష్ణు విశాల్‌ను పెళ్లి చేసుకొన్నది. అప్పటి నుంచి తన భర్తతో సన్నిహితంగా, రొమాంటిక్‌గా ఉంటూ సోషల్ మీడియా పోస్టులతో బిజీగా కనిపిస్తున్నారు. ఇటీవల రాజకీయాల్లోకి వెళ్తున్నారంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. నేను రాజకీయాల్లోకి రానని చెప్పను. కానీ ప్రస్తుతం నా దృష్టి బాడ్మింటన్ అకాడమీపై ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X