»   » బాహుబలిలో ఆమె నటించి ఉంటే.. ప్రభాస్‌కు ఇంత పేరు వచ్చేది కాదు.. వర్మ

బాహుబలిలో ఆమె నటించి ఉంటే.. ప్రభాస్‌కు ఇంత పేరు వచ్చేది కాదు.. వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొంటున్నది. చిత్రంలోని విజ్వువల్ ఎఫెక్ట్స్, శివగామి, బాహుబలి, కట్టప్ప, భళ్లాలదేవ, బిజ్జాలదేవ పాత్రలను తీర్చిదిద్దిన విధానం గురించి విపరీతమైన చర్చ జరుగుతున్నది. అయితే బాహుబలి2 ఎప్పటికప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బాహుబలి ప్రభంజనంలో భాగం కాలేకపోతున్నందుకు ఒకరు చింతిస్తూ ఉండవచ్చు అనే విధంగా వర్మ ట్వీట్ చేశారు.

శివగామి పాత్రను నిరాకరించిన శ్రీదేవి

శివగామి పాత్రను నిరాకరించిన శ్రీదేవి

ఎందుకంటే శివగామి పాత్ర కోసం ముందు అలనాటి అందాల తార శ్రీదేవిని సంప్రదించారు. అయితే రెమ్యునరేషన్, ఇతర అంశాల కారణంగా శ్రీదేవీ, రాజమౌళికి మధ్య పొంతన కుదర్లేదు. ఆ తర్వాత ఆ అవకాశం రమ్యకృష్ణకు దక్కింది. శివగామి పాత్ర పోషించిన రమ్యకృష్ణ ఇక ఆ పాత్రను ఎవరూ పోషించలేరు అనే భావనను కల్పించడంలో సఫలీకృతమయ్యారనే మాట వినిపిస్తున్నది.


ఇంకా నాకు ఆశ్చర్యమేస్తుంది..

బాహుబలి ఘన విజయం సాధించిన నేపథ్యంలో శివగామి పాత్రను శ్రీదేవి పోషించి ఉంటే ఎలా ఉంటుందనే వాదనను తెరపైకి తెచ్చారు. శివగామి పాత్రను శ్రీదేవి ఎందుకు నిరాకరించిన విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ శ్రీదేవి ఆ పాత్రను పోషించి ఉంటే ఆమె కెరీర్‌లోనే అద్భుతమైన చిత్రమయ్యేదనే అభిప్రాయాన్ని వర్మ వ్యక్తం చేయడం గమనార్హం.


ప్రభాస్ కంటే ఎక్కువ..

చాలా కాలం సినిమాలకు దూరమైన శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత బాహుబలి2 సినిమాను చేసి ఉంటే ప్రభాస్ కంటే ఎక్కువ క్రెడిట్‌ను ఆమె కొట్టేసి ఉండేది అని వర్మ మరో ట్వీట్ చేశాడు.


రూ.1500 కోట్ల దిశగా

రూ.1500 కోట్ల దిశగా

ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను వసూళ్లు చేస్తున్నది. ప్రభాస్, రమ్యకృష్ణ, అనుష్కలు నటించిన ఈ చిత్రం ఇటీవలే అరుదైన 1000 కోట్ల మార్కును దాటేసింది. తదుపరి లక్ష్యంగా రూ.1500 కోట్ల మైలురాయి దిశగా పరుగులు పెడుతున్నది.English summary
super success of Baahubali 2, RGV is making Sridevi regret her decision all the more. In fact, RGV believes that had Sridevi played Sivagami Devi in Baahubali 2, she would have overshadowed Prabhas in the franchise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu