»   » టామ్ బోయ్ పాత్ర చేసా: హన్సిక

టామ్ బోయ్ పాత్ర చేసా: హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒళ్లు తగ్గి మరీ ఆఫర్స్ పడుతున్న హన్సిక తాజాగా 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో హీరోయిన్ గా చేసింది. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై విష్ణు మనోజ్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ఆమె టామ్ బోయ్ పాత్రను పోషించినట్లు తెలియచేసింది. ఆ పాత్ర తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని,తనలోని నటిని మరోసారి ఆవిష్కరిస్తుందని గర్వంగా చెప్తోంది. అలాగే మోహన్ బాబు లాంటి గొప్ప నటుడుతో చేయటం తన అదృష్టమని అంది. మంచు మనోజ్ తో మరోసారి చేయటం హ్యాపీగా ఉందని అంటోంది.

'గోల్‌మాల్-3' చిత్రానికి రీమేగా శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్, రవీనాటాండన్, హన్సిక ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత విష్ణు మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, తమ్ముడు, నేను, నాన్న కలిసి తొలిసారిగా నటించిన ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుందని, మనోజ్ పోషించిన లేడీగెటప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఈనెల 31న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు తప్పక విజయాన్ని అందిస్తారని కోరుకున్నారు.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ- పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి హీరోగా తానీ చిత్రంలో సరికొత్త సెటైరికల్ డైలాగులను వినిపించనున్నానని, అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మనోజ్ కంపోజ్ చేసిన ఫైట్స్, డాన్సులు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
On her role in Pandavulu Pandavulu Tummeda Hansika said " I play a tomboy who is Vishnu’s love interest. It wasn’t difficult to play a tomboy on screen, because I’m like that in real life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu