twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్‌కి పండగరోజు-నేడు మెగాస్టార్ పుట్టినరోజు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమపై ఏకచత్రాధిపత్యం కొనసాగించిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. నేటితో ఆయన 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని 57వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

    చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు.

    'పునాదిరాళ్ళు"తో చలనచిత్ర రంగప్రవేశం చేసిన మెగాస్టార్... 'ఖైదీ"తో అందరి మనసు దోచాడు. పసివాడి"ప్రాణం"గా పిల్లల ను అలరించాడు. "స్వయంకృషి" తో 'రుద్రవీణ" కు జాతీయ అవార్డు సాధించాడు."మరణమృదంగం" తో మెగాస్టార్ అయ్యాడు. ఈ 'జగదేకవీరుడు" అతిలోకసుందరి తో రాసలీల లాడి,"గ్యాంగ్ లీడరై ' 'రౌడీఅల్లుడు" & 'ఘరానామొగుడు" గా అందరికీ 'ఆపద్భాంధవుడై"నాడు. 'ఇంద్ర"సేనుడి గా విజయఢంకా మ్రోగిస్తూ 'ఠాగూర్" గా చరిత్ర సృష్టించాడు."శంకర్ దాదా MBBS"అంటూ ఆప్యాయత పంచి 'అందరివాడు" గా నిలిచాడు ఈ 'జై చిరంజీవ.

    సినిమాలోకంలోనుండి రాజ‌కీయాల్లోకి వెళ్ళి అక్కడ కూడా త‌న‌దైన పంథాలో ముందుకు ప‌య‌నిస్తూ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కాంగ్రెస్ నేత‌గా, రాష్ట్ర్ర రాజ‌కీయాల‌లో ఒక బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎద‌గ‌డానికి ముందుకు సాగుతున్న మెగాస్టార్‌, ప‌ద్మభూష‌ణ్‌, డాక్ట్ చిరంజీవికి తెలుగు వన్ ఇండియా తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    English summary
    He was once the emperor of Tollywood and though he is no longer into films, he is still called the megastar of Telugu film industry. He is none other than Chiranjeevi and today he is celebrating his birthday. Mega star turned politician Chiranjeevi celebrates his 57th birthday on August 22!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X