For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HappyBirthdayNTR: టాలీవుడ్ చరిత్రలో ఎన్టీఆర్ ఒక్కడే.. అప్పుడే జాతీయ అవార్డు.. ఆ సీరియల్‌లోనూ తారక్

  |

  నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. టీనేజ్‌లోనే రికార్డుల వేట ప్రారంభించిన అతడు.. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తన హవాను చూపిస్తున్నాడు. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనా తన సత్తాను చూపించిన తారక్.. మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇక, ఈ మధ్య వరుస విజయాలను అందుకుంటోన్న అతడు.. ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం అయ్యాడు. ఇక, నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఆర్టికల్ మీకోసం!

  తాత సినిమాతో ఎంట్రీ.. జాతీయ అవార్డ్

  తాత సినిమాతో ఎంట్రీ.. జాతీయ అవార్డ్

  సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర' అనే సినిమాతో 8 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత అంటే 13 ఏళ్ల వయసులో ‘బాల రామాయణం' అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. అదే సమయంలో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును దక్కించుకుంది.

  అలా రావాల్సింది.. ఇలా వచ్చిన తారక్

  అలా రావాల్సింది.. ఇలా వచ్చిన తారక్

  బాల నటుడిగా సత్తా చాటిన ఎన్టీఆర్‌.. ‘స్టూడెంట్ నెం1' అనే సినిమాతో హీరోగా పరిచయం కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల అది ఆలస్యం కావడంతో.. ‘నిన్ను చూడలని' అనే సినిమా ముందు విడుదలైంది. ఈ చిత్రం నిరాశ పరచగా.. రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం1' మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో లేట్ అయినా మంచి సక్సెస్‌ను అందుకున్నాడు.

  టీనేజ్‌లోనే ఇండస్ట్రీ హిట్.. కష్టాలు స్టార్ట్స్

  టీనేజ్‌లోనే ఇండస్ట్రీ హిట్.. కష్టాలు స్టార్ట్స్

  ‘స్టూడెంట్ నెం1' తర్వాత ఎన్టీఆర్‌కు ‘ఆది' మూవీ బ్లాక్ బస్టర్‌ హిట్‌ను అందించింది. ఈ చిత్రంతో అతడికి మాస్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ‘సింహాద్రీ' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సమయంలో తారక్‌కు 19 ఏళ్లే కావడం విశేషం. దీని తర్వాత ‘యమదొంగ' వచ్చే వరకూ ఎన్నో ఫ్లాపులను చవి చూశాడు తారక్.

  వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో జూనియర్

  వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో జూనియర్

  ‘యమదొంగ' తర్వాత నుంచి ఎన్టీఆర్ ఓ హిట్లు రెండు ఫ్లాపులు అన్నట్లుగా సాగాడు. అప్పుడే అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

  అప్పుడా సీరియల్‌లో.. ఇప్పుడు హోస్ట్‌గా

  అప్పుడా సీరియల్‌లో.. ఇప్పుడు హోస్ట్‌గా

  జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపైనా తన మార్కును చూపిస్తున్నాడు. వాస్తవానికి చిన్నప్పుడే అంటే 13 ఏళ్ల వయసులోనే ‘భక్త మార్కండేయ' అనే సీరియల్‌లో లీడ్ రోల్ చేశాడతను. ఇక, సుదీర్ఘమైన విరామం తర్వాత ‘బిగ్ బాస్' షోతో హోస్టుగా మారి బుల్లితెరపై సందడి చేశాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తారక్.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోతో త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

  ప్రతిష్టాత్మక సినిమాలో భాగమైన ఎన్టీఆర్

  ప్రతిష్టాత్మక సినిమాలో భాగమైన ఎన్టీఆర్

  వరుస హిట్లతో దూసుకెళ్తోన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా హీరోయిన్లు.

  టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు.. అలా

  టాలీవుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు.. అలా


  యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో సింగర్‌గానూ మారి ఎన్నో పాటలను ఆలపించాడు. ఈ క్రమంలోనే పలు అవార్డులను కూడా అందుకున్నాడు. మరీ ముఖ్యంగా కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ'లో తారక్ పాడిన ‘గెలయా గెలయా' అనే పాటతో బెస్ట్ సింగర్‌గా నిలిచాడు.

  ఫ్యూచర్ ప్రాజెక్టులు ఇలా.. బాలీవుడ్‌లో

  ఫ్యూచర్ ప్రాజెక్టులు ఇలా.. బాలీవుడ్‌లో

  RRR పట్టాలపై ఉండగానే.. కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు ఎన్టీఆర్. దీనితో పాటే మరికొందరు దర్శకులను లైన్‌లో పెట్టుకున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ‘ఉప్పెన' దర్శకుడు బుచ్చి బాబు సనతోనూ ఓ ప్రాజెక్టు ఉండనుంది. వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతోనూ తారక్ సినిమా చేస్తాడని టాక్. కొంత కాలంగా సక్సెస్‌కు చిరునామాలా మారిన ఎన్టీఆర్.. మరిన్ని విజయాలను అందుకోవాలని, కరోనా నుంచి కోలుకోవాలని ఆశిస్తూ.. ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Jr NTR is one of the Star Hero in Telugu Film Industry. Today his Birthday. In This Occasion.. We Tell You Unknown Facts About Tarak Career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X