»   » చాలా దూరం వెళ్లాల్సి ఉంది: లక్ష్మీ ప్రసన్న

చాలా దూరం వెళ్లాల్సి ఉంది: లక్ష్మీ ప్రసన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా రంగంలో తొలి అడుగులు వేస్తున్నా. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మనోజ్‌ 'పోటుగాడు'తో అలరించాడు. విష్ణు 'దూసుకెళ్తా'తో సిద్ధంగా ఉన్నాడు. నా సినిమా 'చందమామ కథలు' కూడా సిద్ధమవుతోంది. నా సినిమా 'బాస్మతిబ్లూస్‌' కూడా వస్తోంది. ఇవన్నీ నాకు ఆనందాన్నిచ్చేవే అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మీ ప్రసన్న. మంగళవారం ఆమె జన్మదినం. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న మీడియాతో మాట్లాడారు.

'పుట్టిన రోజు జరుపుకుంటున్నాను అంటే.. గతేడాది నా జీవితంలో సాధించిన విజయాలు ఏమిటి అని చూసుకుంటాను. 'కడలి' కోసం మణిరత్నంగారితో పని చేశాను. 'గుండెల్లో గోదారి', 'బాస్మతి బ్లూస్‌' అనే ఆంగ్ల చిత్రం... ఇలా గతేడాది నాకు చాలా ఆనందాల్ని, సంతృప్తిని ఇచ్చింది. వీటితోపాటు 'దూసుకెళ్తా' కోసం రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో ఓ అతిథి పాత్ర చేశాను. ఆయనతో పని చేయడం మరచిపోలేని అనుభూతి అంటూ వివరించింది.

Manchu Lakshmi Prasanna

ఇక జీవితాన్ని ఆనందంగా గడపాలి.. అదే సమయంలో పది మందికి ఉపయోగపడే మంచి పని చెయ్యాలి. ఈ సిద్ధాంతంతోనే నేను ముందుకెళ్తున్నాను. తెలుగులో నటించిన తొలి సినిమాతోనే నంది పురస్కారం అందుకున్న లక్ష్మీ ప్రసన్న వైవిధ్యమున్న పాత్రలవైపే మొగ్గు చూపుతున్నారు. 'కడలి', 'గుండెల్లో గోదారి' సినిమాల్లోని పాత్రలు అందుకు నిదర్శనం. ఆమెకు ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Manchu Lakshmi Prasanna is the daughter of the popular actor Dr. Mohan Babu. She also appeared in some commercials like Toyota, AARP and Chevrolet. She acted in movies like “Aanganaga O Dheerudu” , “Dongala Mutha”, “Uu Kodathara? Ulikki Padathara?”, “Gundello Godari”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu