»   » నవ యువ మన్మధునికి జన్మదిన శుభాకాంక్షలు...

నవ యువ మన్మధునికి జన్మదిన శుభాకాంక్షలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్య చిత్రం పబ్లిసిటీ స్టిల్స్ లో అల్లు అర్జున్ ను చూసిన వారందరూ ఆచ్చర్యపోయారు. అసలు గంగోత్రి అల్లు అర్జున్ కు- ఆర్య అర్జున్ కు పొంతనే లేదని సంబరమాచ్చర్యాలకు గురయ్యారు. ఈ క్రెడిట్ మొత్తం ఈ చిత్రం దర్శకుడు సుకుమార్ కే చెందుతుంది. విభిన్న ప్రేమకథాచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే సుకుమార్ కధానాయకుల పాత్రల చిత్రణలో కూడా ఎంతో వైవిధ్యంగా చూపుతాడు. ఆర్య తర్వాత వచ్చిన జగడం, ఆర్య 2లో కూడా సుకుమార్ తన ప్రతిభను చాటుకున్నాడు.

తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సుకుమార్ నాగచైతన్యతో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య పూర్తి ట్రెండీగా, స్టయిలిష్ గా, డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. చూసిన వారంతా చైతు చాలా క్యూట్ గా వున్నాడు అంటున్నారు. అంతే కాకుండా అజయ్‌ భుయాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలో నటిస్తూ సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. 'జోష్‌"తో హీరోగా పరిచయమై... రెండో చిత్రం 'ఏమాయ చేశావె"తో ఆంధ్రప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవయువ మన్మధుడు అక్కినేని నాగచైతన్య నేటితో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ రోజు (నవంబర్‌ 23) నవ యువ సామ్రాట్ నాగచైతన్య పుట్టినరోజు. సో... హ్యాపీ బర్త్ డే చెబుతూ చైతుకు మరో విజయం లభించాలని దట్స్ తెలుగు.కాం తరుపున ఆల్ ది బెస్ట్ చెబుదాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu