India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday NTR: సినీ చరిత్రలో తారక్‌దే ఆ రికార్డు.. ఆస్తుల విలువ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే!

  |

  విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే రికార్డుల వేట ప్రారంభించిన అతడు.. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు.

  RRR Team Reacts On Memes పడి పడి నవ్విన Ram Charan, Jr NTR | Filmibeat Telugu

  ఇలా సుదీర్ఘ కాలంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు, హోస్టింగ్ అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా అతడి ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలు తెలుసుకుందాం!

  చిన్నప్పుడే జాతీయ అవార్డ్ సొంతం

  చిన్నప్పుడే జాతీయ అవార్డ్ సొంతం

  ఎన్టీఆర్ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర' అనే సినిమాతో 8 ఏళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అంటే 13 ఏళ్ల వయసులో ‘బాల రామాయణం' అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. అదే సమయంలో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది.

  హీరోయిన్ బెడ్‌రూం వీడియో వైరల్: బట్టలు విప్పేసి మరీ అలా కనిపించడంతో!

  మొదటి సినిమా విషయంలో డ్రామా

  మొదటి సినిమా విషయంలో డ్రామా

  ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్ నెం1' అనే సినిమాతో హీరోగా పరిచయం కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల అది ఆలస్యం కావడంతో.. ‘నిన్ను చూడలని' అనే సినిమా ముందు విడుదలైంది. ఈ చిత్రం నిరాశ పరచగా.. రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం1' మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆలస్యమైనా అతడికి భారీ స్వాగతం లభించినట్లైంది.

  ఇండస్ట్రీ హిట్లు.. కష్టాలు కూడా స్టార్ట్

  ఇండస్ట్రీ హిట్లు.. కష్టాలు కూడా స్టార్ట్

  తారక్‌కు మొదట్లోనే ‘స్టూడెంట్ నెం1', ‘ఆది' వంటి సక్సెస్‌లు వచ్చాయి. దీంతో అతడికి మాస్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ‘సింహాద్రీ' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత ‘యమదొంగ' వచ్చే వరకూ ఎన్నో ఫ్లాపులను చవి చూశాడు. ఆ సమయంలో అతడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.

  HBD Sudigali Sudheer: ఒక్కో షోకు సుధీర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అతడి ఏడాది సంపాదన తెలిస్తే షాకే!

  వరుస హిట్లు.. పాన్ ఇండియా రేంజ్

  వరుస హిట్లు.. పాన్ ఇండియా రేంజ్

  ‘యమదొంగ' తర్వాత ఎన్టీఆర్ ఎన్నో ఫ్లాపులను చవి చూశాడు. ఇలాంటి సమయంలో ‘టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ', RRR వంటి హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. తద్వారా సినీ చరిత్రలో ఈ ఘనత అందుకున్న స్టార్ హీరోగా రికార్డు సాధించాడు.

  క్రేజీ కాంబోలు.. పవర్‌ఫుల్ స్క్రిప్టులు

  క్రేజీ కాంబోలు.. పవర్‌ఫుల్ స్క్రిప్టులు

  RRRతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఇప్పుడు వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే కొరటాల శివతో తన 30వ సినిమాను ప్రకటించిన తారక్.. ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమాను సెట్ చేసుకున్నాడు. వీటితో పాటు బుచ్చిబాబు సనతో ఓ సినిమా కూడా చేయబోతున్నాడు. అలాగే, దిగ్గజ దర్శకుడు శంకర్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నాడని టాక్.

  యాంకర్ సుమకు హ్యాండిచ్చిన తెలుగు హీరో: ఈవెంట్‌కు పిలిచి పరువు తీయడంతో గొడవ

  జూ ఎన్టీఆర్ ఆస్తులు, రెమ్యూనరేషన్

  జూ ఎన్టీఆర్ ఆస్తులు, రెమ్యూనరేషన్

  టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్ నికర విలువ దాదాపు రూ. 450 - 500 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, అతడు ఒక్కో సినిమాకు రూ. 40 - 50 కోట్లు చార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా ఒక్క నెలకు తారక్ యాడ్స్, సినిమాల ద్వారా 5 - 7 కోట్ల వరకూ ఆదాయాన్ని అందుకుంటున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  ఇంటి విలువ, కార్లు, యాక్సిసిరీస్‌లు

  ఇంటి విలువ, కార్లు, యాక్సిసిరీస్‌లు

  నందమూరి ఫ్యామిలీకి చెందని జూనియర్ ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. దీని విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందట. అలాగే, ప్రస్తుతం అతడు వాడుతోన్న కార్లు ఇతర యాక్సిసిరీస్‌ల విలువ రూ. 15 - 20 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇలా ఈ నందమూరి హీరో రెండు చేతులా బాగానే సంపాదించాడని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  కొంత కాలంగా సక్సెస్‌కు చిరునామాలా మారిన ఎన్టీఆర్.. మరిన్ని విజయాలను అందుకోవాలని.. తన నటనతో అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Jr NTR is one of the Star Hero in Telugu Film Industry. Today his Birthday. In This Occasion.. Lets See His Net Worth and Remuneration Details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X