Happy Birthday Sanjay Dutt: కేజీఎఫ్ 2లో అధీరా లుక్ రిలీజ్.. ట్రెండింగ్‌గా మారిన పిక్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జూలై 29న జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. తన 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని కేజీఎఫ్: చాప్టర్ 2 యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీలోని అధీరా లుక్‌ను రిలీజ్ చేశారు. దాంతో సంజయ్ దత్ లుక్‌తో కూడిన కేజీఎఫ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు సంజయ్ దత్ ఆనందం వ్యక్తం చేస్తూ కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. సంజయ్ దత్ ట్విట్ చేసి.. ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. కేజీఎఫ్2లో నటించడం అమేజింగ్. మీరు చాలా కాలంగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నట్టు నాకు తెలుసు. మీరు వేచి ఉన్నందుకు ఆ ఫలితం మంచి సంతృప్తిని అందిస్తుంది అని సంజయ్ దత్ ట్వీట్ చేశారు.

యుద్దం రంగానికి సిద్ధమవుతున్నామనే విషయాన్ని నాతోపాటు దుష్ట శక్తులు అంగీకరిస్తాయి అంటూ అధీర చెప్పిన డైలాగ్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేసి... అధీరా సంజయ్ దత్‌కు.. హ్యాపీ బర్త్ డే అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రను పొషిస్తున్నారు. యష్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











