For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే ఆయన...‘సూపర్ స్టార్’(స్పెషల్ స్టోరీ)

  By Bojja Kumar
  |

  ఆయన మంచి నటుడు మాత్రమే కాదు మనసున్నవ్యక్తి కూడా. సాహసానికి మారు పేరుగా నిలిచి తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి కొన్ని దశాబ్దాల పాటు ఆయన సేవలను అందించారు. ఆయనే మన సూపర్ స్టార్‌ కృష్ణ. ఏళ్లు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో కనిపించే కృష్ణ నేడు 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.. కృష్ణకు వన్ ఇండియా తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.

  సూపర్‌ స్టార్‌ కృష్ణగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ.! ఈయన 1942వ సంవత్సరం మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. సినీరంగంలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న మనసున్న మనిషిగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు.

  కృష్ణ తేనెమనసులు అనే చిత్రంలో నటించి సినీరంగ ప్రవేశం చేసారు. సాహసానికి మారుపేరుగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎందరో తలపెట్టి సాధ్యంకాక వదిలేసిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్ని మరీ నిర్మించి తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఓఅద్భుతమైన హిట్‌ను అందించారు.

  ఇంగ్లీష్ సినిమాల్లో మాత్రమే కనిపించే కౌబోయ్‌ పాత్రలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారాయన. ఆ తరవాతి కాలంలో మరిన్ని కౌబోయ్ చిత్రాలు వచ్చినా అవేమీ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా మించి ఉండకపోవడం గమనార్హం. అలాగే మాములు కుటుంబ కథాచిత్రాల స్థాయికి ఎంతో ఎత్తులో ఉండేలా 'పండంటి కాపురం' చిత్రనిర్మాణం జరగడం కృష్ణ ఆలోచనకు ఫలితమే. ఈ సినిమా కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి.

  సోషల్ క్రైమ్ సినిమాని 'ఫ్యామిలీ సినిమా' అనే ఫీలింగ్ 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంతో కలిగించారు. నష్టపోయిన నిర్మాతలకు పారితోషికం గురించి పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ డేట్స్ ఇచ్చి ఆదుకునేవారాయన. తను నటించే సినిమా భవిష్యత్ గురించి, అది ఆడుతుందా? ఆడదా? కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు.

  కౌబాయ్‌ హీరోగా ప్రసిద్ది చెందిన ఈ సూపర్‌ స్టార్‌ రాజకీయ రంగప్రవేశం చేసి విజయఢంకా మోగించారు. దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మత్రమే కాకుండా, దర్శకడిగా, నిర్మాతగా కూడా రాణించి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ వారసుడిగా ఇప్పుడు మహేష్ బాబు తెలుగు సిని పరిశ్రమ నెం.1 స్థాయి హీరోగా తండ్రిని మించిన తనయుడు అని నిరూపించాడు.

  తన సినీ వారసులతో కృష్ణ ఫోటోలు....

  1. తన సినీ వారసులు మహేష్ బాబు, రమేష్ బాబు, సుధీర్ బాబులతో కృష్ణ

  తండ్రి కృష్ణతో మహేష్ బాబు

  మహేష్ బాబు, రమేష్ బాబులతో కృష్ణ

  ఓ పెళ్లి వేడుకలతో కూతురు మంజుల, తనయులు మహేష్ బాబు, రమేష్ బాబులతో కృష్ణ

  కృష్ణ వారసులు, సర్కిల్ లో మహేస్ బాబు

  English summary
  Actor Krishna celebrating his 71th birthday today (May 31). The actor was once one of the leading heroes of Tollywood during the 70's and 80's and received accolades for his performances from all the classes. Krishna also directed and produced several super hit films under Padmalaya Film Studios a production house owned by him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X