twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహానటి’ చూస్తుండగా గొడవ, నీచమైన కామెంట్లు: ఏడుస్తూ బాధను పంచుకున్న హరితేజ!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Big Boss Fame Hariteja Makes A Sensational Comments

    సీరియల్స్‌, సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హరితేజ.... బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్లో పాల్గొనడం ద్వారా పాపులర్ సెలబ్రిటీ అయిపోయారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆమె ఇటీవల హైదరాబాద్‌లో 'మహానటి' సినిమా చూసేందుకు కుటుంబంతో కలిసి ఓ థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన తనను చాలా బాధేసిందని, తోటి ఆడవాళ్లు తమ గురించి చాలా నీచంగా మాట్లాడారని, ఆమె అన్న మాటలకు తన కోపం కట్టలు తెంచుకుందని, ఆమెతో గొడవ పెట్టుకున్నాను అని హరితేజ వెల్లడించారు. ఆ సంఘటన గురించి వెల్లడిస్తూ వీడియో రిలీజ్ చేశారు.

    ‘సినిమా వాళ్లు' అంటూ నీచంగా...

    ‘సినిమా వాళ్లు' అంటూ నీచంగా...

    సినిమాలో పాత్రలు పోషించే వారు కేవలం పేమెంట్ తీసుకుని, ఏదో చేసేద్దామని టైమ్ పాస్ కోసం చేయరు. ఆ పాత్ర కోసం ప్రాణం పెట్టి, ఆ పాత్ర బాగా చేయాలని ప్రతి రోజూ రాత్రి కలలు కని మిమ్మల్ని అందరినీ ఆ పాత్ర మెప్పించాలని ఇష్టంతో, తపనతో చేస్తారు. ఇందులో మా స్వార్థం మీ అభినందనలు పొందాలనే తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. అదే సమయంలో మేము ప్రేక్షకుల నుండి, సమాజం నుండి రెస్పెక్ట్ కూడా కోరుకుంటాం. కానీ సమాజంలో కొందరు ‘సినిమా వాళ్లు' అనే పేరుతో మా పట్ల చాలా నీచంగా మాట్లాడటం చాలా బాధేస్తుంది అంటూ హరితేజ ఆవేదన వ్యక్తం చేశారు.

    నాకు నా పని మీద రెస్పెక్ట్ ఉంది

    నాకు నా పని మీద రెస్పెక్ట్ ఉంది

    నేను చాలా చిన్న వయసులో, చిన్న కుటుంబం నుండి ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాల్లోకి వెళితే అమ్మాయి ఏమవుతుందో అని భయపడే ఒక తల్లికి, ధైర్యం చేసి కూతురిని సినీ ఇండస్ట్రీకి పంపిన సాధారణ ఉద్యోగం చేసే తండ్రికి పుట్టిన బిడ్డను. దేవుడి దయ వల్ల నా చేతిలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. మంచి జీవితం ఉంది. సినిమాల్లో కంటే ముందు సీరియల్స్ చేసి ఇక్కడి వరకు చేరుకున్నాను. ఈ ప్రయాణంలో కష్టం, సుఖం, బాధ, ఏడుపు, ఆకలి, భయం అన్ని చూశాను. నాకు నా పని అంటే గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. చాలా ఇష్టంతో డిగ్నిఫైడ్ గా ఈ పని చేస్తున్నాను అని హరితేజ తెలిపారు.

    భరించ లేనంత బాధ కలిగించింది.

    భరించ లేనంత బాధ కలిగించింది.

    కొందరు ఇష్టమొచ్చినట్లు సినిమా వాళ్ల గురించి మాట్లాడటం, వారిని క్యారెక్టర్‌లెస్ మనుసుల్లా చూడటం, దూషించడం చూశాను. ఒక వంద రూపాయలు పెట్టి సినిమా చూసి, ఆ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టును కొనేశాము, వారంతా మా ప్రాపర్టీ అనే విధంగా కొందరు ఫీలవ్వడం నాకు భరించ లేనంత బాధ కలిగించింది. ఈ దు:ఖం వెనక ఉన్న ఓ చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నాను... మహానటి సినిమా చూడటానికి వెళ్లిన సమయంలో జరిగిన గొడవ గురించి హరితేజ తెలిపారు.

    థియేటర్లతో గొడవ గురించి....

    థియేటర్లతో గొడవ గురించి....

    చాలా రోజుల నుండి ‘మహానటి' చూడాలని ప్రయత్నిస్తున్నా కూడా కొంత బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇటీవల అమ్మా, నాన్న, నేను, చెల్లి అంతా కలిసి ‘మహానటి' చూడటానికి ఒక థియేటర్ కు వెళ్లాము. ఇంటర్వెల్ వరకు చెల్లిపక్కన కూర్చున్నాను. తర్వాత అమ్మ అడగటంతో ఆమె పక్కన వెళ్లి కూర్చున్నాను. నేను అమ్మ వైపుకు వెళుతున్న తరుణంలో నాన్నను ఇటు వైపుకు షిప్ట్ చేయాల్సి వచ్చింది. అపుడు ఇటు వైపు ఉన్న ఒక తల్లీకూతుళ్లు నాతో వాదనకు దిగారు. ‘ఇంతకు ముందు కూర్చున్నారు కదమ్మా... అలాగే కూర్చోండి, మీ నాన్న పక్కన కూర్చునేందుకు నా కూతురు కంఫర్టబుల్‌గా లేదు అని చెప్పారు. నేను వెంటనే ఏమీ అనలేదు.... తప్పేంటి ఆంటీ తండ్రే కదా? అందరూ ఒకలా ఉండరు అని అన్నాను. అప్పటికే నాన్న, చెల్లి ఎందుకు డిస్క్రషన్ అంటూ వారు సీట్లు మారుతున్నారు. ఆ సమయంలో ఆవిడ ఒక మాట అన్నారు. ఆ మాటతో చాలా కోపం వచ్చింది.... అని హరితేజ తెలిపారు.

    నా కోపం కట్టలు తెంచుకుంది

    నా కోపం కట్టలు తెంచుకుంది

    ‘మీరైతే సినిమా వాళ్లమ్మా... ఎవరి పక్కనైనా కూర్చుంటారు, మాకు ఆ దరిద్రం పట్టలేదన్నారు' అని ఆమె అనడంతో నాకు కట్టలు తెంచుకునే కోపం వచ్చింది. ఆపుకోవడం నా వల్ల కాలేదు. ఆ మాటను భరించలేక పోయాను. అక్కడి నుండి డిస్క్రషన్ మొదలై చాలా దూరం వెళ్లింది. కోపంతో ఆమెపై అరిచాను. ఒక మూమెంటులో ఏడుపు కూడా వచ్చింది.... అని హరితేజ తెలిపారు.

    అనకూడని మాటలు సినిమా వాళ్ల గురించి అన్నారు

    అనకూడని మాటలు సినిమా వాళ్ల గురించి అన్నారు

    మేము సినిమా వాళ్లం ఏమైనా చేస్తాం, ఎవరి పక్కనైనా కూర్చుంటాం... ఆవిడ, ఆవిడ కూతురు ఎవరి పక్కన కూర్చోరంట, మగాళ్ల పక్కన కూర్చుని సినిమా చూడరట. అప్పుడు ఒకటే చెప్పాను థియేటర్ మొత్తం కొనుక్కోలేక పోయారా? లేదంటే లేడీస్ షో పెడితే చూడలేక పోయారా? అందరు మగవాళ్లు ఒకేలా ఉండరు అన్నాను. ఇలా చాలా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమె బోలెడు మాటలు అంది, అనకూడని మాటలు అంది సినిమా వాళ్ల గురించి... నాకు బాధేసింది. దీన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. దీన్ని ఎలాంటి రెవల్యూషన్ కోసం చెప్పడం లేదు. మార్పు అనేది వస్తుందో రాదో కూడా నాకు తెలియదు... అని హరితేజ తెలిపారు.

    బుద్ది జ్ఞానం కలిగించాలని దేవుడిని కోరుకోవడం ఏమీ చేయలేను

    బుద్ది జ్ఞానం కలిగించాలని దేవుడిని కోరుకోవడం ఏమీ చేయలేను

    నేను చెబుతుంది ఒకేట... సినిమా అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, అన్ని చోట్లా అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఎవరైనా ఒక ఎంటర్టెన్మెంట్ కావాలన్నా? కాస్త సరదా కావాలన్నా వెంటనే మనం వెళ్లేది సినిమాకే. మనందరం చదువుకున్న వాళ్లం, మంచి మంచి కుటుంబాల నుండి వచ్చిన వాళ్లం. సినిమా పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలు వేరే, బయట ఉన్న ఆడపిల్లలు వేరే... ఇలా మాట్లాడటం మానండి. మేమందరం కూడా ఆడపిల్లలమే. మేమంతా కూడా సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిన వాళ్లమే. మాకు అందరికీ బాధ ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు అలాంటి కామెంట్లు చేయవద్దు. అపుడే మీ జీవితాలు, మా జీవితాలు బావుంటాయని నా ఫీలింగ్. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా దీని గురించి రకరకాలుగా మాట్లాడేవారిని నేనేం చేయలేను, వారికి నేను ఏమీ చెప్పలేను. వారికి మంచి బుద్ది జ్ఞానం కలిగించాలని దేవుడిని కోరుకోవడం తప్ప.... అని హరితేజ వ్యాఖ్యానించారు.

    ఇష్టం లేకుంటే నా జీవితం నుండి వెళ్లిపోండి

    ఇష్టం లేకుంటే నా జీవితం నుండి వెళ్లిపోండి

    నేను లైకుల కోసం సోషల్ మీడియాలో ఉండటం లేదు. నా ఫోటోకు ఎన్ని లైకులు వచ్చాయో చూసుకునే ఫోబియా కూడా లేదు. నా ఫ్రెండ్స్‌తో కాంటాక్టుతో ఉండటానికి, నేనంటే ఇష్టపడే వారికి నేను ఏం చేస్తున్నానో తెలియజెప్పడానికి సోషల్ నెట్వర్క్ వాడతాను. మీకు నేను నచ్చకపోతే దయచేసి నా జీవితంలో నుండి వెళ్లిపోయి నన్ను అన్ ఫాలో చేసి మీ జీవితంలో మీరు సంతోషంగా బ్రతకండి. కేవలం ఒక బ్యాడ్ కామెంట్ పాస్ చేయడానికో, తిట్టడానికో, బాధ పెట్టడం అనే క్రూరమైన మెంటాలిటీ మంచిది కాదు... అని హరితేజ వ్యాఖ్యానించారు.

    Read more about: hari teja bogg boss tollywood
    English summary
    Hari Teja instagram live video goes viral. Hari Teja is a Telugu actress, television serial artist, character artist in films, singer, dancer and anchor. She is a professional Kuchipudi dancer and performed in many Telugu TV shows. She also participated in Telugu reality show like Telugu Bigg Boss, Ragada The Ultimate Dance Show. She is one of the 16 participants of Bigg Boss Telugu game show in Star Maa television. She stood in third place for Bigg Boss Telugu season 1.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X