»   » నా జీవితం మారిపోయిన రోజు, గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్ గారికి అవసరమా అనిపించింది!

నా జీవితం మారిపోయిన రోజు, గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్ గారికి అవసరమా అనిపించింది!

Subscribe to Filmibeat Telugu
Nela Ticket Audio Launch : Harish Shankar Speech

మాస్ మహా రాజా రవితేజ నటించిన నేల టికెట్టు ఆడియో వేడుక గురువారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ప్రత్యక ఆకర్షణగా నిలిచారు. రవితేజ, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజే వేరు. ఆడియోవేడుకతో అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య జరిగిన హాస్య భరితమైన సంఘటనలు ఆకట్టుకున్నాయి. అదే విధంగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ప్రసంగం కూడా అభిమానులని ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్, రవితేజపై హరీష్ శంకర్ ప్రశంసల జల్లులు కురిపించారు.

దర్శకుడిగా జన్మనిచ్చింది ఆయనే

దర్శకుడిగా జన్మనిచ్చింది ఆయనే

తనకు రవితేజ దర్శకుడిగా జన్మనిచ్చారని హరీష్ తెలిపాడు. ఆ జన్మకు అర్థం పరమార్థం తీసుకువచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, గబ్బర్ సింగ్ చిత్రం తరువాత తన స్థాయి మారిపోయిందని అన్నారు.

నా జీవితం మారిపోయిన రోజు

నా జీవితం మారిపోయిన రోజు

సరిగ్గా ఆరేళ్ళ క్రితం నా జీవితం మారిపోయిన సంఘటన జరిగిందని హరీష్ అభిప్రాయపడ్డారు. మే 11, 2012 న గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఆ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి వరకు నిరాశలో ఉన్న పవన్ అభిమానులు ఊగిపోయేలా ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య పోలికలు

పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య పోలికలు

పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య చాలా పోలికలు ఉన్నాయని హరీష్ శంకర్ తెలిపారు. వీరిద్దరి వలన చాలా మంది కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమై మంచి స్థాయిలో ఉన్నారని హరీష్ తెలిపారు. తనతో పాటు శ్రీనువైట్ల, బోయపాటి,బాబీ వంటి దర్శకులకు రవితేజ అవకాశాలిచ్చారని అన్నారు. కరుణాకరన్, అరుణ్ ప్రసాద్, పూరి జగన్నాధ్ వంటి దర్శకులకు పవన్ కళ్యాణ్ అవకాశాలిచ్చారని అన్నారు. మేమంతా స్టేజిపై నిలబడి మాట్లాడుతున్నాం అంటే అందుకు కారణం వారే అని అన్నారు.

 పవన్ కళ్యాణ్ గారికి అవసరమా

పవన్ కళ్యాణ్ గారికి అవసరమా

తాను పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్ లు కూడా ఫాలో అవుతుంటానని హరీష్ తెలిపాడు. మీ హీరోకు రాజకీయాలు ఎందుకు అని ఎవరు అడిగినా సమాధానం చెప్పలేదు. కానీ ఇటీవల విజయవాడలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తున్న వీడియో చూసా. చెమటలు కక్కుతూ ఎండలో ఆయన నడుస్తుంటే ఓ విషయం అనిపించింది. కోట్లాది రూపాయల సంపాదన, సినిమా ఆలు వదిలేసి ఇది పవన్ కళ్యాణ్ గారికి అవసరమా అని అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన సిద్ధాంతాలు తనకు తెలుసు అని ఆయన విజయం సాధించాలని హరీష్ శంకర్ ఆకాంక్షించారు.

English summary
Harish Shankar Speech At Nela Ticket Movie Audio Launch. Harish Shankar remembers Gabbar Singh movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X