»   » ఏఆర్ రెహమాన్ సంగీత దానం, తనలాంటి వారే లక్ష్యం

ఏఆర్ రెహమాన్ సంగీత దానం, తనలాంటి వారే లక్ష్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇండియన్ మ్యూజిక్ సంచలనం ఏఆర్ రెహమాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఆస్కార్ అవార్డులు సాధించి ఇండియా పేరును ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఘనత ఆయనది. ఓ వైపు ఇండియాలో టాప్ డైరెక్టరుగా కొనసాగుతూ హాలీవుడ్ సినిమాలకు సైతం పని చేస్తూ ప్రపంచ వేదికపై తన సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

సంగీత రంగంలో ప్రపంచ స్థాయి నిపుణులు తీర్చిద్దాలనే లక్ష్యంతో రెహమాన్ కెఎం సంగీత పాఠశాలను నెలకొల్పాడు. సంగీత రంగంలో పలువురిని తనలాంటి వారిని చేయాలన్నదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. పలువురు విద్యార్థులకు ఉచితంగా సంగీతాన్ని నేర్పిస్తుండటం విశేషం. రెహమాన్ సంగీత పాఠశాల విధ్యార్థులు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఐదేళ్లుగా మూడు బ్యాచ్‌ల విద్యార్థులకు సంగీతాన్ని నేర్పిస్తున్నారు.

Harman India will support AR Rahman’s KM Music Conservatory

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నిర్వహిస్తున్న కెఎం మ్యూజిక్ పాఠశాలకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు హార్మన్ ఇండియాయ సంస్థ సైతం ముందుకు వచ్చింది. 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సంగీతం అందించేందుకు ముందుకొచ్చింది. వీరికి స్కాలర్ షిప్స్ సైతం అందించనుంది.

హార్మన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, కంట్రీ మేనేజ్ ఎం లక్ష్మి నారాయణ ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. వీరికి శిక్షణ ఇవ్వడంలో సన్ షైన్ ఆర్కెస్ట్రా వారు భాగస్వాములు కానున్నారు.

English summary
Harman India, wholly-owned subsidiary of premium audio and infotainment solutions company Harman International of the US, will support AR Rahman’s KM Music Conservatory in teaching music to poor children.
Please Wait while comments are loading...