»   » కోర్టు తీర్పు: రాంగోపాల్ వర్మకు రూ.10లక్షల జరిమానా

కోర్టు తీర్పు: రాంగోపాల్ వర్మకు రూ.10లక్షల జరిమానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు ఢిల్లీకోర్టు రూ.10లక్షల జరిమానా విధించింది. 1975 లో విడుదలైన బ్లాక్‌బ్లాస్టర్ మూవీ షోలే కాపీరైట్ హక్కులను ఉద్ధేశ్యపూర్వకంగా అతిక్రమించారని వర్మతోపాటు ఆయన ప్రొడక్షన్ కంపెనీపైన షోలే నిర్మాత కుమారుడు విజయ్‌సిప్పి, మనవడు జీపీ సిప్పీ కోర్టును ఆశ్రయించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

షోలే మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కాపీరైట్ హక్కులను రాంగోపాల్ వర్మ కీ షోలే పేరుతో ఉల్లంఘనకు పాల్పడినందుకు కోర్టు వర్మకు జరిమానాను విధించింది. షోలే ఆధారంగా రామ్ గోపాల్ వర్మ గతంలో అమితాబ్ ప్రధాన పాత్రలో వర్మ కి ఆగ్ అనే చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినా ఆ వివాదాలు ఇప్పటికీ వర్మను వెంటాడుతూనే ఉన్నాయి.

రామ్ గోపాల్ వర్మ తాజా తెలుగు చిత్రం విషయానికి వస్తే....

HC imposes Rs 10 lakh fine on Ram Gopal Varma for remaking ‘Sholay’

అటాక్ సినిమా విషయానికొస్తే... మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం "ఎటాక్". ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇదే.

జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వడ్డే నవీన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌ చిత్రం 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది.

ఈ చిత్రం పూర్తి యాక్షన్ తో రూపొందనుందని సమాచారం. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగ వాడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు. మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో కరెంట్ తీగ చిత్రం వచ్చింది. ఇప్పుడీ చిత్రం తెరకెక్కుతోంది.

రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం గంధపు చెక్కల స్మగ్లర్ .. వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరి మన్ననలూ అందుకుంటోంది.

English summary
The Delhi High Court imposed a fine of Rs.10 lakh on film maker Ram Gopal Varma and his production house for making the remake of 1975 blockbuster 'Sholay'.
Please Wait while comments are loading...