»   » అయ్యో ....ఆ స్టార్ హీరోకు మళ్లీ జైలు కూడు తప్పదా?

అయ్యో ....ఆ స్టార్ హీరోకు మళ్లీ జైలు కూడు తప్పదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 1993 ముంబై బాంబు పేలుళ్ల సమయంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన 2013లో జైల్లో సరెండర్ అయ్యారు.

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 2016 ఫిబ్రవరిలో ఆయన విడుదల జరిగింది. సత్ప్రవర్తన కారణంగా ఆయన్ను 8 నెలల ముందే విడుదల చేశారు. అయితే సంజయ్ దత్ విడుదల విషయంలో మరోసారి వివాదం రేగింది. శిక్షాకాలం పూర్తి కాక ముందే ఆయన్ను ఎలా విడుదల చేస్తారంటూ పిటీషన్ దాఖలైంది.

ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించిన కోర్టు

ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించిన కోర్టు

ఈ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శిక్షాకాలం ముగియకముందే పెరోల్ పై సంజయ్ దత్ ను ఎలా విడుదల చేశారని అడిగింది. దీనిపై సమాధానం చెప్పాలని ఎరవాడ జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది.

నిర్మాతల్లో మళ్లీ టెన్షన్

నిర్మాతల్లో మళ్లీ టెన్షన్

సంజయ్ విషయంలో మళ్లీ కోర్టు గొడవ మొదలు కావడంతో ఆయనతో సినిమాలు కమిటైన దర్శకులు, నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. మళ్లీ ఆయన జైలుకెళితే చాలా నష్టం వస్తుందనే ఆందోళనలో వారు మునిగి పోయారు.

1993 కేసు

1993 కేసు

సంజయ్ దత్ జైలు శిక్షకు కారణం...1993 ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్‌దత్ వద్ద ఆయుధాలు లభించడమే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

శిక్ష

శిక్ష

రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ గతేడాది మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైల్లో శిక్ష అనుభవించాడు.

8 నెలల ముందుగానే విడుదల

8 నెలల ముందుగానే విడుదల

2016 అక్టోబర్‌ వరకు ఆయన శిక్ష అనుభవించాల్సి ఉన్నా....8 నెలల ముందుగానే విడుదల చేశారు. ఫిబ్రవరి 27న అతని విడుదల జరిగింది. జైల్లో సంజయ్‌దత్ ప్రవర్తన చాలా బావుందని, సత్ర్పవర్తన కారణంగా అతన్ని ముందుగా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
The Bombay high court asked the Maharashtra government on Monday to explain why it released actor Sanjay Dutt, serving a sentence over the 1993 bombings, eight months early.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu