»   » చిరంజీవి ఫ్యామిలీ ప్రోద్బలంతోనే తనపై శ్రీజ ఫిర్యాదు చేసిందన్న శిరీష్

చిరంజీవి ఫ్యామిలీ ప్రోద్బలంతోనే తనపై శ్రీజ ఫిర్యాదు చేసిందన్న శిరీష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరకట్నం వేధింపుల కేసులో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూతురు శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు బుధవారం నిరాకరించింది. శిరీష్ భరద్వాజ్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. శిరీష్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై జస్టిస్ బి. శేషశయనా రెడ్డి విచారణ చేపట్టారు. తన భార్య తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని శిరీష్ తన పిటిషన్‌లో వాదించారు.

ప్రేమ వివాహం జరిగి మూడేళ్లయినా తమ మధ్య ఇప్పటి వరకు చిన్న తగాదా కూడా జరగలేదని శిరీష్ చెప్పాడు. శిరీష్ భరద్వాజ్ తరఫున ఆయన న్యాయవాది వాదించాడు. మొదటి నుంచి తమ ప్రేమ వివాహంపై వ్యతిరేకతతో ఉన్న చిరంజీవి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే శ్రీజ తనపై తొందర పడి ఫిర్యాదు చేసిందని శిరీష్ చెప్పుకున్నాడు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించాలని కమిషనర్, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిటీ సివిల్ కోర్టులను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు.

English summary
Chiranjeevi's son - in -law Sirish Bharadwaj blamed chiru's family for srija's complaint against him. High Court rejected Sirish Bharadwaj's bail plea.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu