Don't Miss!
- News
girlfriend: సీక్రేట్ గా పెళ్లి, కొండ మీద రొమాన్స్, పోలీసు అధికారి కొడుకు ఏం చేశాడంటే, ఇంట్లోనే కిల్లర్!
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
‘అసభ్య వీడియోలతో బెదిరిస్తున్నారు.. చర్యలు తీసుకోండి..ఎన్నికల ముంగిట హేమ సంచలనం!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి అలాగే మిగతా ఇతర స్థానాలకు గతంలో పోటీ కూడా ఉండేది కాదు కానీ ఈ మధ్య కాలంలో దానికి పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఎన్నికలు జరగగా ఈసారి మాత్రం వాడివేడిగా సాగుతున్నాయి. ఒకరిమీద ఒకరు కూడా పర్సనల్ గా కూడా ఎటాక్ చేసుకునే విధంగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మారిపోతున్నాయి. తాజాగా ఫేస్ మార్ఫింగ్ చేసి అసభ్య ప్రచారం చేస్తున్నారు అంటూ హేమ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే

హోరాహోరీగా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి ఇప్పటికే వ్యక్తిగత దూషణలు లోకల్ నాన్ లోకల్ వ్యవహారం అలాగే పర్సనల్ విషయాల దాకా ఈ వ్యవహారం వెళ్ళింది. తాజాగా ఇప్పుడు కరాటే కళ్యాణి, నరేష్ మీద హేమ మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. నరేష్, కళ్యాణి ఇద్దరూ తన మీద అసభ్యకర ప్రచారం చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చుతున్నారని హేమ కంప్లైంట్ చేసింది.

ఎగతాళి చేశారు
తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని భయపెడుతూ ఆందోళనకు గురి చేస్తున్నారని హేమ పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని కూడా ఆమె కామెంట్లు చేశారు. తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని హేమ గతంలో చాలాసార్లు కంప్లైంట్ చేశారు. తన ఫోటోలు కాదు అప్పుడప్పుడే ఎదుగుతున్న ఆడపిల్లల ఫోటోలు మొదలు 60 ఏళ్ల నటీమణులు ఫోటోలు వరకు సోషల్ మీడియాలో పెడుతున్నారని వాటి గురించి కంప్లైంట్ చేద్దాము అంటే నరేష్ ఎగతాళి చేసినట్లు మాట్లాడారని ఆమె చెబుతున్నారు..

అప్పుడు కంప్లైంట్ చేస్తే తగ్గాయి
గతంలో ఈ విషయమై నేను సైబర్‌సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశానాని ఆ తరువాత ఇలా అసభ్యకర ఫోటోలు బయటకు వచ్చిన ఘటనలు తగ్గాయని పేర్కొన్నారు. ఇక ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని కళ్యాణి ప్రస్తావిస్తూ 'నేను పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు వారు నాకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫొటోలను ముందుగా సోషల్‌మీడియా నుంచి తొలగించమని సలహా ఇచ్చినట్లు' వ్యాఖ్యానించారు. కళ్యాణి వ్యాఖ్యలను నరేశ్ కూడా సమర్థించారని హేమ పేర్కొన్నారు.

బెదిరిస్తున్నారు
తాను నేను అమర్యాదకరమైన ఫోటోలు గ్రూప్ లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా వారు తమ తమ వీడియోలలో పేర్కొన్నారని, అందుకు ఆధారాలున్నాయని, వాటిని బయట పెడతామని బెదిరించారని హేమ ఆరోపించారు. నరేశ్ వైఖరి నన్ను అగౌరవ పరిచేలా, నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉంది. నాపై అసభ్యకరమైన ప్రచారం చేయకుండా కట్టడి చేయాలని మిమ్మల్ని కోరుతున్నా అని ఆమె ఎన్నికల అధికారిని కోరారు.
Recommended Video

పోలీసులకు ఫిర్యాదు
మా ప్రతిష్టను దిగజార్చు కుటుంబ సభ్యులు ప్రవర్తించాలి కానీ ఆ విషయాన్ని మర్చిపోయి నరేష్, కళ్యాణి వ్యాఖ్యానిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు.. ఇలాంటి ప్రవర్తన గురించి మిగతా సభ్యులకు కూడా కూడా భయం కలిగేలా వారి మీద చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాక తన మీద నరేష్ కళ్యాణిలు చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా ఆ యూట్యూబ్ చానల్స్ యాజమాన్యాలకు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.