»   » త్రివిక్రమ్ అలాంటి సీన్లు రాయనని చెప్పాడట...

త్రివిక్రమ్ అలాంటి సీన్లు రాయనని చెప్పాడట...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతడు సినిమాలో బ్రమ్మానందం-హేమ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంత హాస్యాన్ని పండించాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోయే సీన్లు అవి. ఇందులో నటించిన హేమ...ఇటీవల ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

షూటింగులో భాగంగా బ్రహ్మానందం షూతో హేమను కొట్టే సన్నివేశం ఉంది. అయితే అనుకోకుండా బ్రహ్మీ గట్టిగా కొట్టడంతో హేమ గాయపడిందట. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... ‘అతడు' సినిమా అనగానే బ్రహ్మానందంగారికి , నాకు మధ్య ఉన్న కాఫీ కప్పు సీను టక్కున గుర్తుకు వస్తుంది ఎవరికైనా. అక్కడే ఎడిట్‌ చేసిన సీన్‌ ఒకటి ఉంది. బ్రహ్మానందంగారు ఊరి నుండి రాగానే ఇంట్లో ఉన్న నన్ను పిలుస్తూ కాలి షూ విసురుగా నా మీదకు వచ్చేలా విడవాలి. అయితే ఆయన షూని కాస్త వేగంగా విడిచేసరికి అది నా మీదకు వచ్చి ముఖానికి బలంగా తగిలింది. దాంతో నా మూతి పెద్దగా వాచిపోయింది. అక్కడ ఉన్నవాళ్ళంతా కంగారుపడిపోయారు. త్రివిక్రమ్‌గారయితే ఇక నేను ఎప్పుడూ ఆడవాళ్ళను కొట్టే సీను రాయనన్నారు అని హేమ తెలిపారు.

Hema speaks about Brahmanandam

మహేష్ బాబు గురించి హేమ మాట్లాడుతూ...నాకు చిన్నతనం నుండీ రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు. ‘అతడు' సినిమా షూటింగ్‌ జరిగేటప్పుడు అలాగే భోజనం అయున కాసేపటికి పక్క ఎక్కేసాను. షూటింగ్‌లో భాగంగా నేను పడుకున్న మంచం కింద కుంపటి పెట్టారు. వెచ్చగా ఉంది కదా అని నేను మెదలకుండా పడుకున్నాను. మొదటిరోజు ఎవరూ పట్టించుకోలేదు. కానీ తర్వాత రోజు మహేష్‌బాబు నా భోజనం కాగానే ‘‘ఆ! హేమక్క పడుకుంటుందికానీ మంచంవేసి, కుంపటి పెట్టేయండ్రా'' అంటూ ఏడిపించేసరికి నాకు సిగ్గేసి ఇక ఆ సినిమా పూర్తయ్యేవరకూ అందరితో పాటు లేటుగానే పడుకునేదాన్ని అని చెప్పుకొచ్చారు.

English summary
Tollywood actor Hema speaks about Brahmanandam
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu